NTV Telugu Site icon

MLC Chandrasekhar Reddy: ఆధారాలతో మాట్లాడుతుంటే.. బెదిరిస్తున్నారు..!

Mlc Chandrasekhar Reddy

Mlc Chandrasekhar Reddy

MLC Chandrasekhar Reddy: నేను అన్ని ఆధారాలతో మాట్లాడుతుంటే… బెదిరిస్తున్నారని ఆరోపించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌ రెడ్డి.. శాసనమండలిలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తుంటే అధికార పార్టీ సభ్యులు తట్టుకోలేకపోతున్నారన్న ఆయన.. ఆధారాలతో సహా మాట్లాడుతుంటే.. బెదిరిస్తున్నారని ఫైర్‌ అయ్యారు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విద్యారంగ సమస్యలను ప్రస్తావించాను.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 17 మంది వైస్ ఛాన్సలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వైస్ ఛాన్సలర్ల ఛాంబర్ ల లోకి వెళ్లి మరీ బెదిరించారని ఆరోపించారు.. ఇద్దరితో మాత్రం రాజీనామా చేయించలేదు.. వీరిలో ఒకరు వారి సామాజిక వర్గానికి చెందినవారు.. మరొకరు మంత్రి అచ్చెన్నాయుడు మిత్రుడికి సంబంధించినవారిని తెలిపారు.. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదన్నారు.

Read Also: Nandamuri Balakrishna : బసవతారకం ఆస్పత్రి అంటేనే దేవాలయం తో సమానం

బెదిరించి రాజీనామా చేయించారని నేను ఆరోపించారు.. బెదిరించినట్లు ఆధారాలు ఇస్తే జుడిషియల్ విచారణ వేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ కోరారు.. ఆధారాలు ఇస్తామంటే పట్టించుకోలేదని విమర్శించారు చంద్రశేఖర్‌రెడ్డి.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే రాజీనామా చేసామని కొందరు వైస్ ఛాన్సలర్లు లేఖలో పేర్కొన్నారని గుర్తుచేశారు.. అన్ని ఆధారాలూ మంత్రి లోకేష్ కు ఇస్తాం.. వాటిని చూసైనా న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌ రెడ్డి.. కాగా, శాసన మండలి వేదికగా.. మంగళవారం రోజు వీసీ రాజీనామాలపై వైసీపీ, కూటమి ప్రభుత్వం.. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్‌ మంత్రి చర్చ హాట్‌ హాట్‌ గా సాగిన విషయం విదితమే..