YS Jagan Nellore Tour: వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన కాసేపట్లో ప్రారంభంకానుంది. జనసమీకరణ చేయొద్దని పోలీసులు చెప్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షల నడుమ వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన కొనసాగనుంది. తాడేపల్లిలోని నివాసం నుంచి నెల్లూరు చేరుకుంటారు జగన్. సెంట్రల్ జైల్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శిస్తారు. తర్వాత కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్తారు జగన్. కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు.
Read Also: Extra Marital Affairs: మీరు మారరా.. భర్త హత్యకు లక్ష సుపారీ.. ఇలా దొరికిపోయిన భార్య
జగన్ పర్యటన వేళ.. నెల్లూరు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నందున జగన్ పర్యటనకు జనసమీకరణ చేయొద్దని ఆదేశించారు. పెద్ద సంఖ్యలో జనాలు తరలిరాకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శించవద్దని.. 30 యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీసులు స్పష్టంచేశారు. ఇక, నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్ దగ్గర హెలిపాడ్ ఏర్పాటు చేశారు. ఆ హెలిపాడ్ దగ్గర 15 వాహనాలు, 10మందికే అనుమతి ఇచ్చారు. జైల్లోకి జగన్‌తోపాటు మరో ముగ్గురికి అకాశం కల్పించారు. ఇటు.. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి దగ్గర కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు. 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ దామోదర్. అడుగడుగునా డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. వైసీపీ నేతలు, కార్యకర్తల కదలికలను కూడా పర్యవేక్షిస్తున్నారు. వాహనాల డ్రైవర్ల ఆధార్ కార్డులతోపాటు వారి వివరాలు కూడా ఇవ్వాలన్నారు పోలీసులు. అయితే.. పోలీసుల ఆంక్షలపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి చర్యలు చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Extra Marital Affairs: మీరు మారరా.. భర్త హత్యకు లక్ష సుపారీ.. ఇలా దొరికిపోయిన భార్య
పోలీసుల ఆంక్షల నడుమ వైసీపీ అధినేత జగన్ నెల్లూరులో పర్యటించబోతున్నారు. ఇవాళ ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి నెల్లూరు చేరుకుంటారు. సెంట్రల్ జైల్లో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారు. తర్వాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు. అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లిపోతారు. పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నందున జగన్ పర్యటనకు జనసమీకరణ చేయొద్దని ఆదేశించారు. ఈ పర్యటన పోలీసులకు సవాల్‌గా మారింది. పెద్ద సంఖ్యలో జనాలు తరలిరాకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శించవద్దని.. 30 యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీసులు స్పష్టంచేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం దగ్గర కూడా కేవలం 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. వాహనాల డ్రైవర్ల ఆధార్ కార్డులు వారి వివరాలను అందించాలని పోలీసులు ఆర్డర్ జారీ చేశారు. జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత ఉన్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వైసీపీ నేతలు, కార్యకర్తల కదలికలపై నిరంతర నిఘా ఉంటుందన్నారు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ దామోదర.
Read Also: Vemireddy Prabhakar Reddy: క్వార్ట్జ్ వ్యాపారాన్ని మూసేస్తున్నా.. ఎంపీ వేమిరెడ్డి సంచలన నిర్ణయం!
పోలీసుల ఆంక్షలపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి చర్యలు చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడమని వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనను విజయవంతం చేయాలని క్యాడర్ కు ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు, జగన్ నెల్లూరు పర్యటనపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఫైర్ అయ్యారు. ఖనిజ సంపదను దోచుకుని జైల్లో ఉన్న సహచరులను పరామర్శించడానికి వస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ జనాన్ని రెచ్చ కొడుతున్నారని మంత్రి విమర్శించారు. మొత్తంగా జగన్ నెల్లూరు జిల్లా పర్యటన పోలీసులు వర్సెస్ వైసీపీ నేతలుగా మారింది. ఇప్పటికే జగన్ పర్యటన మూడుసార్లు వాయిదా పడింది. ఈసారి ఎలా సాగుతుందో, ఎంత టెన్షన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
