స్పీకర్ అనర్హత వేటు వేయడంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఏడాది క్రితమే తమను వైసీపీ సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అనర్హత వేటు వేసే నైతిక అర్హత ప్రభుత్వానికి లేదని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకున్నారో.. ఆ రోజు ఈ చర్య తీసుకుని ఉంటే ప్రజలు హర్షించేవారని చెప్పారు. ఈ చర్యలతో వాళ్లు సాధించిందేమీ లేదని.. తమకు వచ్చిన నష్టం కూడా ఏమీ లేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించాల్సిన వేదికల్లో ఒక ఎమ్మెల్యేగా ప్రశ్నిస్తే, దానిని అంటరానితనంగా చూసి తమను సస్పెండ్ చేశారని తెలిపారు. తమను సస్పెండ్ చేసిన తర్వాత.. అనర్హత వేటు వేసే నైతిక అర్హత ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.
Kollu Ravindra: వారి దుర్మార్గాలకు క్రీడాకారులు కూడా బలైపోతున్నారు..
మరోవైపు.. వైసీపీకి కోడూరు కమలాకర్ రెడ్డి రాజీనామా చేస్తున్నారని తెలిసి.. ఈరోజు ఆయన నివాసానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమలాకర్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించాలని వచ్చినట్లు తెలిపారు. నెల్లూరులోని పలు గ్రామాల్లోని ప్రజలతో అతనికి మంచి సంబంధాలు ఉన్నాయి.. ఆయన టీడీపీలోకి రావడం మరింత బలాన్ని ఇస్తుందని అన్నారు. ఇదిలా ఉంటే.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి రానుండడంతో పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాలనూ టీడీపీ కైవసం చేసుకుంటుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
Weather warning: పలు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లిస్ట్ ఇదే!