Vice President Jagdeep Dhankhar: నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై ప్రశంసలు కురిపించారు.. వెంకయ్య నాయుడు ఆలోచనలు మహోన్నతమైనవి.. ఆయన తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారని తెలిపారు. ఆయన ఎప్పుడూ గ్రామీణ ప్రాంతాలతో మమేకమయ్యారు.. వారి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమైనదని పేర్కొన్నారు. వెంకయ్య రాజకీయ వ్యవహారాల్లో తలమునకలై ఉన్నప్పుడు ఆయన సతీమణి ఉషమ్మ వారి కుటుంబానికి అండగా నిలిచారు. వెంకయ్య నాయుడు విజయాల వెనుక ఆమె సహకారం వెలకట్టలేనిది అన్నారు.
Read Also: Hyderabad Metro: నిలబడేందుకు చోటులేదు.. మెట్రోలో కోచ్ లు పెంచండి..
ఇక, స్వర్ణభారతి ట్రస్ట్ రజతోత్సవాలు త్వరలో జరగనున్నాయి. ప్రభుత్వం నుంచి సహకారం లేకుండా 23 ఏళ్ల పాటు సేవా ప్రస్థానం సాగించటం చాలా గొప్ప విషయం అన్నారు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్. ఓ మహాయజ్ఞంలా నిర్వహించిన ఈ ప్రస్థానాన్ని అంకెల్లో కాదు, స్ఫూర్తితో కొలవాలన్న ఆయన.. ప్రభుత్వ సహకారం లేకుండా దీపా వెంకట్ ట్రస్ట్ ను ముందుకు తీసుకు పోతున్న తీరు అభినందనీయమైనది అన్నారు. అలాంటి కార్యక్రమాలకు ఎంతో నిబద్ధత కావాలి.. ఆమెకు నా అభినందనలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్.