Kakani Govardhan Reddy Case: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆచూకీ కోసం పోలీసుల తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.. మూడు బృందాలతో గాలింపు చేపట్టారు పోలీసులు.. కాకాణి సమీప బంధువుల నుంచి సమాచారం సేకరించే పనిలోపడిపోయారు.. హైదరాబాద్, నెల్లూరు సహా.. మరికొన్ని ప్రాంతాల్లో కాకాణి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారట నెల్లూరు పోలీసులు.. మరోవైపు.. మాజీ మంత్రి కాకాణి కేసులో మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చారు పోలీసులు.. కాకాణి గోవర్ధన్ రెడ్డి చిన్న అల్లుడు గోపాలకృష్ణారెడ్డి.. కాంట్రాక్టర్ ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి. ఊరు బిండి చైతన్యలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు.. నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే, విచారణ హాజరైనందుకు ప్రభాకర్ రెడ్డి.. చైతన్య.. గోపాలకృష్ణారెడ్డి సమయం కోరారు.. పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన తెల్ల రాయి అక్రమ తవ్వకం.. రవాణాకు సంబంధించి మరిన్ని వివరాల కోసం వీరిని విచారించాలనే నిర్ణయానికి వచ్చారట పోలీసులు.. మరోవైపు.. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్, తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లపై కూడా విచారణ జరగనుంది.. హైకోర్టు తీర్పు అనంతరం.. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.
Read Also: Court : ‘కోర్ట్’ మూవీ OTT స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన..!