Site icon NTV Telugu

Jail Superintendent Corruption: జైలు సూపరింటెండెంట్ అవినీతి బాగోతం.. ఒక్కొక్కటిగా వెలుగులోకి..!

Nellore District Jail

Nellore District Jail

Jail Superintendent Corruption: నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.. జైలు సూపరింటెండెంట్‌ శ్రీ‌రామ్ రాజారావు అవినీతి, అక్రమాలపై అధికారులు నోరువెల్లబెడుతున్నారు.. రిమాండ్ ఖైదీల తాలుకు బంధువుల నుంచి న‌గ‌దు, మ‌ద్యం డిమాండ్‌ చేసిన ఫోన్ సంభాష‌ణ మ‌రువ‌క‌ముందే వెలుగులోకి మ‌రో అవినీతి బాగోతం వచ్చింది.. గ‌త ఏడాది గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాల‌యం దాడి కేసులో మాజీ మంత్రి కొడాలి నాని అనుచ‌రుడు కాశిని నెల్లూరు జిల్లా జైలుకు రిమాండ్ ఖైదీగా త‌ర‌లించింది న్యాయ స్థానం… అయితే, రిమాండ్ ఖైదీగా వ‌చ్చిన కాశీని బాగా చూసుకునేందుకు, స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు ఉద‌య్ అనే వ్యక్తి నుంచి 20 వేలు ఫోన్ పే వేయించుకున్నట్లు వెలుగులోకి వచ్చింది..

Read Also: Whatsapp View Once: వాట్సాప్ యూజర్లకు షాక్‌.. ‘View Once’ ఫీచర్‌లో పెద్ద లోపం..

ఇక, ఓ హ‌త్య కేసులో జీవిత ఖైదు అనుభ‌విస్తున్న భాస్కర్ అనే ఖైదీ పెరోల్‌పై బ‌య‌ట‌కు రాగా.. మ‌ద్యం బాటిల్ తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేశాడట రాజారావు.. మ‌ద్యం బాటిల్ తీసుకుని తన ఇంటి వ‌ద్దకు రావాల‌ని భాస్కర్‌ను వేధించిన జైలు సూపరంటెండెంట్‌ శ్రీ‌రామ్ రాజారావు సంభాష‌ణ ఆడియోటేపులు వెలుగులోకి వచ్చిన విషయం విదితమే.. అయితే, ఈ వ్యవహారాలపై విచారణ చేప‌ట్టేందుకు రంగంలోకి దిగారు జైళ్ల శాఖ డీఐజీ.. భారీగా అవినీతి, అక్రమాల‌కు పాల్పడుతున్న నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్‌ శ్రీ‌రామ్ రాజారావుపై శాఖ ప‌ర‌మైన చ‌ర్యలు ఉంటాయా? లేక చేతులు త‌డుపుకుని తుడిచేసుకుంటారా?అధికారంలో ఉన్న కూట‌మి ప్రభుత్వం, హోం మంత్రి ఈ అవినీతి జైల్ సూపరింటెండెంట్‌పై ఎటువంటి చ‌ర్యలు తీసుకోనుంది అనేది ఆసక్తికరంగా మారింది..

Exit mobile version