NTV Telugu Site icon

Nedurumalli Ram kumar: పిలవని పేరంటాలకు వచ్చేస్తాడు.. ఆనంపై నేదురుమల్లి ఫైర్

Nedurumalli

Nedurumalli

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై వైసీపీ ఇంఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బాలాయపల్లి ఎంపీపీ పిలిస్తే మండల సమావేశానికి ఎమ్మెల్యే ఆనం వచ్చేస్తాడా? అని ప్రశ్నించారు. ఆనంవి సిగ్గులేని పనులు.. వైసీపీ నుంచి సస్పెండ్ చేసినా పిలవని పేరంటాలకు వచ్చేస్తాడని విమర్శించారు. కండలేరు జలాశయం నుంచి తెలుగుగంగ ద్వారా రైతులకు 200 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశామని తెలిపారు. 500 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని అనం అసంబద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Read Also: Viral Video: అద్భుతంగా కారు నడిపిన 95 ఏళ్ల బామ్మ.. వీడియో చేసిన నాగాలాండ్ మంత్రి

వెంకటగిరి ఎమ్మెల్యే తానే అని చెప్పుకునే ఆనం.. ఇక్కడి ప్రజలకోసం ఏమి చేశాడని ప్రశ్నించారు. సాగునీటికోసం మాట్లాడే ఆనం.. ఐఏబీ సమావేశంలో రైతులకు సాగునీరు కావాలని అడిగాడా? అని దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పి రైతులను, ప్రజలను మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు. రైతుల కష్టాలు, అవసరాలు తెలుసుకొని సీఎం జగన్ సాగునీటి విడుదలకు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. వెంకటగిరి – గూడూరు రోడ్డు పనుల్లో ఆనంకి కమీషన్లు ముట్టలేదా ? అని ప్రశ్నించారు.

Read Also: BJP: రాజస్థాన్ నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే

వెంకటగిరి – గూడూరు రహదారి పనుల విషయంలో ఎమ్మెల్యే ఆనంపై ఇటీవల ఇంచార్జ్ నేదురుమల్లి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో.. నేదురుమల్లి ఆరోపణల్లో వాస్తవం లేదంటూ ఆనం వెల్లడించారు. రోడ్డు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక దుస్థితి వల్లే కాంట్రాక్టర్లు పనులు చేయడం మానేశారని ఆనం రామనారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.