నెల్లూరు నగర శివారులలోని పెన్నా నదిలో ఇసుక రీచ్‌లను అధికారులతో కలిసి మంత్రి డా. పొంగూరు నారాయణ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇసుక రీచ్‌ల్లో యంత్రాలతో తవ్వినా, అక్రమ రవాణా చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు.. ఇసుక రీచ్‌ల్లో సీసీ కెమెరాలను పెడతామని అన్నారు. ప్రజలందరికీ సులభంగా ఇసుక లభించాలనే ఉద్దేశంతోనే ఉచిత ఇసుక పాలసీని ప్రభుత్వం తీసుకు వచ్చిందని మంత్రి చెప్పారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ఎవరైనా తీసుకుపోవచ్చని మంత్రి వెల్లడించారు.
Read Also: Jaishankar: ట్రాంప్-కమల హారిస్.. ఇద్దరిలో భారత్‌కు ఎవరు బెస్ట్.. జైశంకర్ సమాధానం..
రీచ్‌లలోకి ట్రాక్టర్లను అనుమతించిన తర్వాత ఇసుక లభ్యత పెరిగింది.. ధరలు కూడా గణనీయంగా దిగివచ్చాయని మంత్రి నారాయణ అన్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.4 వేలు ఉంటే ఇప్పుడు రూ.15 వందలకు తగ్గింది.. ఇది మరింత తగ్గుతుందన్నారు. నిర్మాణ రంగం అభివృద్ధి చెందాలనేదే ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పారు. ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఈ ఉచిత పాలసీని తీసుకు వచ్చామని మంత్రి నారాయణ తెలిపారు.