NTV Telugu Site icon

Anam Ramanarayana Reddy: అన్ని ప్రాంతాలను సమ దృష్టితో అభివృద్ధి చేస్తాం..

Anam Ramanarayana Reddy

Anam Ramanarayana Reddy

నెల్లూరులో జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు జిల్లా అభివృద్ధిలో భాగ స్వాములు కావాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.. నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. అన్ని ప్రాంతాలను సమ దృష్టితో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టి.. అభివృద్ధిలో మీదైన ముద్ర వేయండని అధికారులకు ఆయన సూచించారు.

Read Also: Robert Vadra: ప్రియాంక గెలుపుపై భర్త రాబర్ట్ వాద్రా ఏమన్నారంటే..!

మీ ప్రాంత ప్రజలు మిమ్మలను గుర్తు పెట్టుకునే విధంగా పని చేయాలని మంత్రి రామనారాయణ రెడ్డి అధికారులతో చెప్పారు. మంచి ప్రజా ప్రతినిధులుగా గుర్తింపు తెచ్చుకోండి.. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు అధికారులు విలువ ఇవ్వాలని ఆయన అన్నారు. వేగవంతమైన అభివృద్ధికి సహకరించండని తెలిపారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు సంబంధిత అధికారులు తప్పని సరిగా హాజరు కావాలి.. హాజరు కాకపోతే చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొ్న్నారు.

Read Also: Bihar By Election Results: బీహార్ ఉప ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటిన ఎన్డీఏ..

పట్టణాలు, నగరాలలో కాలుష్యం లేకుండా చూడాలి.. గ్రీన్ ఎనర్జీ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని మంత్రి రామనారాయణ రెడ్డి అన్నారు. గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీలపై ప్రజలలో అవగాహన కల్పించాలి.. గ్రామ, మండల స్థాయిలలో వర్క్ షాపులు పెట్టాలన్నారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగాలి.. సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో జల జీవన్ మిషన్ పనులకు గత ప్రభుత్వం రాష్ట్రం వాటాను విడుదల చేయకపోవడం వల్ల నిర్వీర్యమైందని తెలిపారు.

Show comments