Site icon NTV Telugu

AP Rains: తీరం దాటిన దాటిన వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు..

Ap Rains

Ap Rains

AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటక ముందే వాయుగుండం బలహీనపడింది. ఇక, నెల్లూరు జిల్లా తడ సమీపంలో తీరం దాటిన దాటిన వాయుగుండం.. గడిచిన 6 గంటల్లో 22 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం తీరం దాటింది. ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండం బలహీన పడతుంది. ఇక, వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వానలు పడుతున్నాయి. అయితే, తుఫాను తీరం దాటడంతో అధికార యంత్రం అప్రమత్తమైంది. దీంతో సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం, పెళ్లకూరు, నాయుడుపేట, గూడూరు, మనుబోలు మండలాల్లో జోరుగా వర్షం కురుస్తుంది. భారీగా వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Read Also: IPL Auction 2025: క్లాసెన్‌కు 23 కోట్లు.. హైదరాబాద్‌ రిటెన్షన్‌ లిస్ట్‌ ఇదే!

అయితే, గూడూరు సమీపంలోని పంబలేరు కు వరద ఉధృతి కొనసాగుతుంది. జలాశయాలు, చెరువులకు భారీగా వరద నీరు చేరుతుంది. సంగం బ్యారేజ్ వద్ద 12 గేట్లు, నెల్లూరు బ్యారేజ్ వద్ద రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. గత 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జలదంకిలో 18, కావలిలో 17, నెల్లూరులో 13, కొండాపురం, సీతారామపురంలలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. సీతారామపురం, అనంతసాగరం, కలిగిరి, బోగోలు మండలాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. మరో 48 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు ఈరోజు కూడా సెలవును అధికారులు ప్రకటించారు.

Exit mobile version