Anil Kumar Yadav: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, తలశిల రఘురామ్, మేరుగ మురళి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి, కాకాణి పూజిత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే నెల 3వ తేదిన మాజీ సీఎం జగన్ నెల్లూరుకి వచ్చి.. జైలులో ఉన్న కాకాణి గోవర్థన్ రెడ్డిని పరామర్శిస్తారు అని వెల్లడించారు. ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది.. అక్రమ కేసులు పెట్టడం సరికాదు అని హెచ్చరించారు.
Read Also: Road Accident: చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం.. ఒక్కసారి వ్యాపించిన మంటలు, ఇద్దరు మృతి!
ఇక, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాకి వైఎస్ జగన్ వస్తున్నారని సమాచారం తెలిసినప్పుడల్లా.. ఏదో ఒక దొంగ కేసు పెడుతున్నారు అని మండిపడ్డారు. 3వ తేదీ పీటీ వారెంట్ వేసి బయటికి తీసుకెళ్లినా.. జగన్ మాత్రం జిల్లాకి రావడం ఖాయం అని తేల్చి చెప్పారు. అలాగే, కాకాణి కూతురు పూజిత మాట్లాడుతూ.. గోవర్థన్ రెడ్డిని కలిసేందుకు ములాఖత్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు అని ఆరోపించింది. వైఎస్ జగన్ వచ్చినప్పుడు నాన్న జైలులో లేకపోతే.. ఇంటికి వచ్చి మమల్ని పరామర్శిస్తారు.. ఇప్పుడు చేసిన ప్రతి పనికి భవిష్యత్తులో టీడీపీ నేతలు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అని ఆమె వార్నింగ్ ఇచ్చింది.
