Rowdy Sheeter Srikanth: నెల్లూరులో లేడీ డాన్ అరుణ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా రౌడీషీటర్ శ్రీకాంత్‌ను నెల్లూరు నుంచి విశాఖ సెంట్రల్ జైలుకు ప్రత్యేక వాహనంలో తరలించినట్లు సమాచారం. అయితే, రాజకీయ నేతల అండదండలతో రౌడీ షీటర్ శ్రీకాంత్ తన ప్రియురాలు అరుణతో కలిసి దౌర్జన్యాలు, అక్రమ సెటిల్మెంట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. జైల్లో ఉంటూనే తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న శ్రీకాంత్.. ఫోన్‌ల ద్వారా కూడా సెటిల్మెంట్లకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులపై కూడా దర్యాప్తు జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
Read Also: Cloudburst in Uttarakhand: ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్.. పలువురు గల్లంతు!
అయితే, రౌడీ షీటర్ శ్రీకాంత్‌తో సంబంధాలు కలిగిన గ్యాంగ్స్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు రౌడీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే, శ్రీకాంత్-అరుణలతో కలిసి నేరాలకు పాల్పడిన వారి జాబితాను రెడీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో అరుణ-శ్రీకాంత్ గ్యాంగ్ మొత్తం మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
