Site icon NTV Telugu

AP High Court: ప్రసన్నకుమార్‌రెడ్డిపై హైకోర్టు సీరియస్.. మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా..?

Nallapareddy

Nallapareddy

AP High Court: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది.. అయితే, ఈ వ్యవహారంలో వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది.. ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టింది హైకోర్టు.. మహిళా ఎమ్మెల్యేపై ఆ వ్యాఖ్యలు ఏంటి? అంటూ మండిపడింది.. మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించింది.. అలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించలేం అని స్పష్టం చేసింది..

Read Also: Health Warning: జిలేబీ, సమోసాపై వార్నింగ్ లేబుల్స్.. కేంద్రం క్లారిటీ

కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డిని మందలించింది ఏపీ హైకోర్టు.. అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నియంత్రణలో ఉండాలని హైకోర్టు హెచ్చరించింది.. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్‌ ఇచ్చింది హైకోర్టు.. మీ వ్యాఖ్యలతో న్యూసెన్స్ చేశారని తీవ్రంగా వ్యాఖ్యానించింది.. ఇక, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు..

Exit mobile version