Site icon NTV Telugu

Chandrababu: నేడు ఆత్మకూరులో చంద్రబాబు పర్యటన.. పింఛన్లు పంపిణీ

Chandrababutourtoday

Chandrababutourtoday

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించనున్నారు. నెల్లూరు పాలెంలోని గిరిజన కాలనీలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులను కలిసి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. కొద్దిసేపు వారితో ముచ్చటించనున్నారు.

ఇది కూడా చదవండి: AP High Court: షెడ్యూల్‌ కులానికి చెందిన వ్యక్తి మతం మారితే కులం వర్తించదు.. అట్రాసిటీ కేసు చెల్లదు..!

అనంతరం నారంపేటలో ఎంఎస్ఎమ్ పార్కును ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో 11 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేశారు. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ను కూడా చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇక మేడే సందర్భంగా కార్మికులను కలిసి ముచ్చటించనున్నారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అనంతరం అమరావతికి బయల్దేరి వెళ్లనున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కోసం జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: India Pakistan: పాక్ యాక్టర్లు, సెలబ్రిటీలకు ఇండియా బిగ్ షాక్..

Exit mobile version