Anil Kumar Yadav: నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనకు ఈ నెల 23వ తేదీన కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ వివాదంపై అనేక మంది స్థానికులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే, అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో, పోలీసులు నోటీసులను ఆయన ఇంటి గేట్‌కు అతికించారు.
Read Also: Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం
ఇక, ఈ నోటీసులపై స్పందించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తాను విచారణకు హాజరుకాలేకపోవడానికి వ్యక్తిగత కారణాలతో పాటు కోర్టులో క్యాష్ పిటిషన్ ఉందని తెలిపారు. అలాగే, తాను విచారణను తప్పించుకోవాలని అనుకోవడం లేదు, తన లాయర్ ద్వారా పోలీసులకు సమాచారాన్ని అందించానని చెప్పుకొచ్చారు. ఇక, తాను త్వరలోనే విచారణకు హాజరయ్యే తేదీని వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామంతో అనిల్ కుమార్ వ్యవహారం మరోసారి రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.