Site icon NTV Telugu

Anil Kumar Yadav: మారణాయుధాలతో దాడి.. ప్రసన్నకుమార్ ఇంటిపై 200 మందికి పైగా హత్యాయత్నం!

Anil

Anil

Anil Kumar Yadav: నెల్లూరులోని సావిత్రినగర్ లో తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఏఎస్పీకి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయతో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. 200 మందికి పైగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై పెద్ద పెద్ద మారణాయుధాలతో దాడి చేశారు అని ఆరోపించారు. ఆయన్నీ హతమార్చేందుకు ప్రయత్నం చేశారు.. ఇంట్లో ఉన్న ప్రసన్న తల్లి షాక్ కు గురై ఏదైనా అయ్యుంటే ఎవరిది బాధ్యత అన్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి, అనుచరుల పైనా హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నన్ను జైలుకు పంపాలని చూస్తున్నారు.. నేను జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాను.. ప్రభాకర్ రెడ్డిని జాగ్రత్తగా ఉండమని ప్రసన్న చెప్పారు.. మీరు ఏ కేసులు పెట్టిన నేను సిద్ధంగా ఉన్నాను.. క్వార్డ్జ్ పై నేను జైలుకు పోవాల్సి వస్తే మొదట పోయేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డే అని అనిల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

Read Also: Vangalapudi Anitha: ప్రసన్నకుమార్‌ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయండి.. హోంమంత్రి అనిత ఫైర్‌

ఇక, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రసన్న కుమార్ రెడ్డిని అంతం చేయాలని పథకంతోనే వచ్చారు.. ప్రసన్న కుమార్ కి ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి.. కాబట్టి బతికే ఉన్నారు.. ప్రసన్న ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి అని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు విష సంస్కృతికి తెర లేపారు అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

Exit mobile version