Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Dhadi Veera Bhadra Rao

వైసీపీ సీనియర్ నేతలో అసంతృప్తి జ్వాల !

Published Date :November 9, 2021 , 2:01 pm
By Lakshmi Narayana
వైసీపీ సీనియర్ నేతలో అసంతృప్తి జ్వాల !
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒకప్పుడు చక్రం తిప్పిన ఆ మాజీ మంత్రికి ఓ జూనియర్ ఎమ్మెల్యే వర్గం చెక్ పెడుతోంది. 30 ఏళ్ల అనుభవంలో ఎన్నడూ చూడని పరిణామాలు సీనియర్ నేతలో అసంతృప్తి జ్వాలలు రగిలించాయ్. వర్గ రాజకీయాలతో విసిగెత్తిపోయిన ఆయన ఎక్కువ కాలం భరించడం కష్టం అనుకున్నారో ఏమో కానీ…కుండబద్దలు కొట్టేశారు. నాకు సీఎం తప్ప బాస్‌లు ఎవరూ లేరని బహిరంగంగానే ప్రకటించి సరికొత్త చర్చకు తెరతీశారు.

విశాఖ జిల్లా అనకాపల్లి వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు బలమైన రాజకీయ ప్రత్యర్ధులు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా, మంత్రిగా, శాసనమండలి ప్రతిపక్ష నేతగా పని చేసిన అనుభవం వీర భద్రరావుకి ఉంది. ఎప్పుడూ రాజకీయంగా ప్రత్యర్ధితోనే పోరాటం చేసిన దాడికి తొలిసారి వింతైన అనుభవం సొంత పార్టీ నుంచే ఎదురవుతోంది. అధికార పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయనకు సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్నాథ్‌కు మధ్య గ్యాప్ ఉందనేది బహిరంగ రహస్యమే.

ఐతే…ఇటీవల ఆ దూరం బాగా పెరిగిపోవడమే కాదు…ఒకరి వర్గంను మరొకరు టార్గెట్ చేసుకునే స్థాయికి చేరింది. ఈనేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు మాజీ మంత్రిని ఆహ్వానించకుండా పక్కన పెట్టేసిందట ఎమ్మెల్యే గ్రూప్. తమతో కలిసి రావడం లేదని హైకమాండ్‌కు చెప్పేందుకు ఇలా కుట్ర చేస్తున్నారని దాడి వర్గం భావిస్తోంది. ఇటీవల నెహ్రు చౌక్‌లో చేపట్టిన జనాగ్రహ దీక్షకు పిలవని పేరంటమే అయినా దాడి వెళ్లివచ్చారు. దీనికి కారణం ఉందట. చంద్రబాబుకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమానికి వెళ్లకపోతే టీడీపీకి తాను అనుకూలం అనే ప్రచారం చేస్తారనే అనుమానంతోనే వెళ్లారట. జగన్ పాదయాత్రకు నాలుగేళ్లు అయిన సందర్భంగా ఎమ్మెల్యే వర్గం, దాడి గ్రూప్ వేరు వేరుగానే ర్యాలీలు నిర్వహించాయి.

ఐతే..ఇలా చూస్తూ వదిలేస్తే ఎమ్మెల్యే వర్గం రాజకీయంగా దెబ్బ తీయవచ్చనే అనుమానం దాడిలో కనిపిస్తుందట. అందుకే ఎమ్మెల్యే వర్గం పిలిచినా..పిలవకపోయినా..కార్యక్రమాలకు వెళ్లటంతో పాటు..తనకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్‌ లేదనే విషయాన్ని బహిర్గతం చేయటం ద్వారా..ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నది దాడి ప్లాన్ అట.

ఇక…అదే వేదికపై నుంచి దాడి వీరభద్రరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనకు సీఎం ఒక్కరే బాస్ అని జగన్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తానని కుండ బద్దలు కొట్టేశారు. తద్వారా ఎమ్మెల్యే అమర్నాథ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదనే సంకేతాలు పంపించారు వీరభద్రరావు. ఈ పరిణామాల వెనుక పవర్ పాలిటిక్స్ కారణం అనేది అనకాపల్లి గురించి తెలిసిన వారికి ఇట్టే అర్ధం అవుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • off the record
  • Veera Bhadra Rao
  • ycp

తాజావార్తలు

  • IND W vs SA W: ఐపీఎల్ గోల మధ్యలో మరో క్రికెట్ పండుగ.. నేటి నుంచి దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్.!

  • Tollywood : తిమ్మరాజు పల్లి, పాపం ప్రతాప్, బ్యాడ్ బాయ్ కార్తిక్.. ప్రీమియర్ రివ్యూ

  • Shreyas Iyer: ఫాలోయింగ్ పెరుగుతోంది, ఇక మనల్ని ఎవడ్రా ఆపేది.. శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Book Cover Trick: మీ పిల్లల పుస్తకాలకు నిమిషాల్లో ఇలా అట్టలు వేయండి.. కత్తెర, టేప్ అవసరం కూడా లేదు..!

  • Women Reservation Law: అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ

ట్రెండింగ్‌

  • Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions