NTV Telugu Site icon

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో జనవరిలో విశేష పర్వదినాలు ఇవే..

Ttd

Ttd

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్‌.. ఇవాళ 2022కి బైబై చెప్పేసి.. రాత్రి 12 గంటల తర్వాత 2023కి అడుగుపెట్టబోతున్నాం.. అంటే రేపటి నుంచే 2023 జనవరి నెల ప్రారంభం కాబోతోంది.. అయితే, జనవరి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఎక్కువగా ఉన్నాయి.. తిరుమలకు వెళ్లే భక్తులు.. అవి దృష్టిలో పెట్టుకుని ప్లాన్‌ చేసుకోవడం మంచిది..

Read Also: Aadhaar: ఆధార్‌ను ఇలా చేస్తే అంతే సంగతులు.. కేంద్రం వార్నింగ్

ఇక, విశేష పర్వదినాల విషయానికి వస్తే.. జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ఇక, జనవరి 2న తిరుమల శ్రీవారి స్వర్ణ రథోత్సవం. జనవరి 3న శ్రీ స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి.. శ్రీవారి చక్రస్నానం.. జనవరి 7న శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవం.. జనవరి 7 నుండి 13వ తేదీ వరకు ఆండాళ్ నీరాటోత్సవం నిర్వహించనున్నారు.. జనవరి 14న భోగిపండుగ.. జనవరి 15న తిరుమల శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం సమాప్తి. మకర సంక్రాంతి.. జనవరి 16న కనుమ పండుగ.. తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేస్తారు. తిరుమలనంబి సన్నిధికి వేంచేపు. శ్రీ గోదాపరిణయోత్సవం.. జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం రోజున వసంత పంచమి.. జనవరి 28న రథసప్తమి నిర్వహించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం.

Show comments