NTV Telugu Site icon

Thammineni Seetharam: అమరావతే రాజధాని అన్నవాడిని పొలిమేరల‌ నుంచి తరిమి తరిమి కొట్టాలి..!

Thammineni Seetharam

Thammineni Seetharam

ఓవైపు అమరావతే రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌.. మరోవైపు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ ముందుకు సాగుతోన్న అధికార పార్టీ.. ఇలా.. ఇప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఈ వ్యవహారం కాకరేపుతూనే ఉంది.. రాజధాని కోసం అమరావతి రైతుల పాదయాత్ర.. దానికి వ్యతిరేకంగా జేఏసీ విశాఖ గర్జనతో ఉత్కంఠ పరిస్థితులు ఏర్పడగా.. ఈ నేపథ్యంలో స్పీకర్‌ తమ్మినేని సీతారం సంచలన వ్యాఖ్యలు చేశారు.. అమరావతే రాజధాని అన్నవాడిని జిల్లా పొలిమేరల‌ నుంచి తరిమి తరిమి కొట్టాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మూడు రాజధానుల అంశం జగన్మొహాన్ రెడ్డి కోరుకున్న అభివృద్ధి శంఖారావం అన్నారు.. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయటానికే మూడు రాజధానుల నిర్ణయమని స్పష్టం చేసిన ఆయన… భుమి కోసం, బుక్తికోసం, నిరుపేదల హక్కుల కోసం పోరాడిన నేల ఇది అన్నారు.. రాజధానుల విషయంలో సీఎం జగన్‌ నిర్ణయాన్ని స్వాగతించాలని పిలుపునిచ్చారు.

Read Also: Pawan Kalyan Vizag Tour: జనసేనాని విశాఖ టూర్‌ షెడ్యూల్‌ ఇదే.. ‘విశాఖ గర్జన’తో టెన్షన్‌..!

ఇక, ఉత్తరాంధ్ర ప్రాంతం మరో అగ్ని గుండం కాబోతుందని హెచ్చరించారు తమ్మినేని సీతారాం.. మూడు రాజధానులు వర్దిల్లాలని ముందుకు వెళ్తామన్న ఆయన.. తాళి కట్టిన ఆడది, మొలతాడుకట్టిన మగాడు, మీసం మొలిసిన యువకులంతా రోడ్లమీదకు రావాల్సిందేనని పిలుపునిచ్చారు.. అంతేకాదు.. అమరావతే రాజధాని అన్నవాడిని జిల్లా పొలిమేరల‌ నుంచి తరిమి తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చారు.. ఆకలి, అవిద్య మీద నక్సల్ బరి ఉద్యమం ఈ గడ్డ మీద జరిగింది… ప్రాణాలొడ్డి భవిష్యత్ తరాలకోసం పోరాడారని గుర్తుచేశారు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం.