Site icon NTV Telugu

AyyannaPatrudu: కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుని కలిసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు..

Ayyanna

Ayyanna

AyyannaPatrudu: కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుని ఏపీ స్పీకర్ అయ్యన పాత్రుడు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో 80 మంది వరకు కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. వీరందరూ సభా మర్యాదలు ఎలా పాటించాలన్న దానిపై తరగతులు నిర్వహిస్తాం.. అసెంబ్లీలో సీనియర్ నాయకుల సభలో మాట్లాడిన స్పీచులు ఉన్నాయి.. వీటిని రిఫరెన్స్ గా కొత్తవాళ్లు తీసుకుంటే మంచిది.. అలాగే వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజు లాంటి సీనియర్లతో తరగతులు ఇప్పించాలనుకుంటున్నాం అని పేర్కొన్నారు. 1983 లో అశోక్ గజపతి రాజు, నేను ఒకే సారి టీడీపీలో ఎన్టీఆర్ సమక్షంలో జాయిన్ అయ్యాం.. ఆయనతో 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు.

Read Also: Aditya L1 Mission: ఇస్రో మరో చరిత్ర.. హాలో కక్ష్యను పూర్తి చేసిన ఆదిత్య-ఎల్1

ఇక, స్పీకర్ గా ఎన్నికైన తర్వాత అశోక్ గజపతిరాజునీ మర్యాద పూర్వకంగా కలవడం కోసం విజయనగరం వచ్చాను అని అయ్యాన్నపాత్రుడు తెలిపారు. ఈ రోజు మా కూటమి ప్రభుత్వానికి ప్రజలు గొప్ప బాధ్యత అప్పగించారు.. ప్రజలు మాకు ఇచ్చింది పదవి కాదు.. ఇది ఒక బాధ్యత.. అందరితో కలిసి గౌరవంగా సభను ముందుకు నడిపిస్తా.. 88 మంది కొత్త ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు.. వీళ్ళందరికీ అసెంబ్లీ రూల్స్ విధివిధానాలు గురించి ట్రైనింగ్ ఇస్తాను అని ఆయన చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో లైబ్రరీ ఉంది.. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అందులో చదువుకోగలిగితే చాలు.. చంద్రబాబు నాయుడిలా సూచనలు ఇచ్చే వ్యక్తి ఎవరూ లేరు.. రాష్ట్రం కోసం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలందరూ ఆమోదిస్తారు అని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.

Exit mobile version