Speaker Ayyanna Patrudu: ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఇందులో భాగంగానే, ఈ నెల 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు అసెంబ్లీ వ్యవహారాలపై ట్రైనింగ్ ఉంటుంది.. ఈ సారి ఏపీలో గెలిచిన వాళ్లలో ఎక్కువ మంది కొత్త ఎమ్మెల్యేలే ఉన్నారు.. కాబట్టి, ఎమ్మెల్యేల ట్రైనింగ్ ప్రారంభానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా హాజరు కానున్నారని చెప్పుకొచ్చారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముగింపు రోజున మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవుతారంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.
Read Also: Harish Rao : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అందరి బ్రతుకులు రోడ్డున పడ్డాయి
ఇక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మొదట నుంచి అసెంబ్లీకి రావాలని కోరాను అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆయన సమావేశాలకు రావడం లేదు.. ఆయనకు అవగాహన ఉందో లేదో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన సమయం నాకు కూడా ఇవ్వాలని జగన్ అంటున్నారు.. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు.. ఆయనకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని వెల్లడించారు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కావాలంటే 18 మంది ఎమ్మెల్యేలు కావాలి అని సూచించారు. జగన్ కి వచ్చింది 11 సీట్లు మాత్రమే అని స్పీకర్ అయ్యన్న తెలిపారు.
Read Also: Allu Aravind: చరణ్ నా కొడుకు లాంటోడు.. ఇక్కడితో ఆపేయండి!
అలాగే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ.. జగన్ ప్రెస్ మీట్ లో హైకోర్టు ఏపీ స్పీకర్ కి నోటీసులు పంపిందని చెప్పారు.. కోర్టులు స్పీకర్లకు సమన్లు ఇవ్వలేదు.. ఇవ్వడానికి కూడా వీల్లేదు అన్నారు. గతంలో ఎంపీగా, ప్రతిపక్ష నేతగా, సీఎంగా చేసిన జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. జగన్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చినా.. రాకపోయినా.. ఎమ్మెల్యేల అవగాహన సదస్సుకు రావాలని కోరుకుంటున్నాను.. శాసన వ్యవస్థ, ఎమ్మెల్యేల పాత్ర, ప్రవర్తన నియమావళిపై ఒక పుస్తకాన్ని ఎమ్మెల్యేలు అందరికీ అందజేస్తామని ఆయన వెల్లడించారు. తగువులాట లేకుండా సభను హుందాగా నిర్వహించడం కోసం ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నాం.. శాసన సభ్యుడు 60 రోజుల సమావేశాలకు హాజరుకాకపోతే వారి సభ్యత్వం రద్దు అవుతుంది.. సెలవు కోరుతూ ఇప్పటి వరకు జగన్ లేఖ పెట్టుకోలేదు అని రఘురామకృష్ణం రాజు చెప్పుకొచ్చారు.