గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది 18 శాతం నేరాలు తగ్గాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. శుక్రవారం వార్షిక క్రైం రేట్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది నమోదైన చోరీ కేసుల్లో సగానికి పైగా కేసులు చేధించామన్నారు. చోరీ కేసులను అధికంగా రికవరీ చేశామని, 949 చోరీ కేసులు నమోదు కాగా 452 కేసులు చేధించామన్నారు.
Also Read: Historic Peace Deal: కేంద్రం, ఉల్ఫా మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం.. అమిత్ షా సమక్షంలో సంతకం
‘ఆస్తి రికవరి కూడా 45 శాతం నుండి 52 శాతానికి పెరిగిందని, మహిళలు చిన్నారులపై జరిగిన నేరాలు కూడా గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. గత ఏడాది రేప్ కేసులు 82 నమోదు కాగా ఈ ఏడాది 62 నమోదు అయ్యాయి రోడ్డు ప్రమాదాల్లో కూడా తగ్గుదల స్పష్టంగా కనిపించింది. మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై అత్యధికంగా శిక్ష పడిన కేసులు అధికంగా నమోదు అయ్యాయి. పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిలో ఒకరికి 27 ఏళ్ల పైబడి జైలు శిక్ష , నలుగురికి జీవిత ఖైదు, 20 ఏళ్ల ఖైదు ఒకరికి పది సంవత్సరాల ఖైదు ముగ్గురికి పడింది.
Also Read: Shaik Shabnam: రామునిపై భక్తికి మతంతో పనేంటి? అయోధ్యకు ముస్లిం యువతి పాద్రయాత్ర
2023 సంవత్సరానికి గాను 21441 కేసులు లోక్ అదాలత్‌తో పరిష్కారం అయ్యాయి. పేకాటకు సంబంధించి 297 కేసులు నమోదు చేసి 1700 మందిని అరెస్ట్ చేశాం… వారి వద్ద నుండి 62 లక్షలు నగదు, 89 వాహనాలు సీజ్ చేసాం. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 84 కేసులు నమోదు చేసి 254 మందిని అరెస్ట్ చేశాం. 8200 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 58 వాహనాలు సీజ్ చేసాం పోలీస్ స్టేషన్లో మహిళలకు సంబంధించి 1718 ఫిర్యాదులు స్వీకరించగా 277 ఫిర్యాదులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసాం’ అని తెలిపారు.