South Central Railway: తెలుగు రాష్ట్రాల్లో మే 21న 17 రైళ్లు రద్దు.. ప్రటించిన దక్షిణ మధ్య రైల్వే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Central Railway: తెలుగు రాష్ట్రాల్లో మే 21న 17 రైళ్లు రద్ద చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్వే అభివృద్ధి పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 21న 17 రైళ్లను రద్దు చేస్తున్నమని, ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.
ఘట్కేసర్-చర్లపల్లి మధ్య చర్లపల్లి కోచింగ్ టెర్మినల్ నిర్మాణ పనుల కారణంగా ఈ నెల 21న 17 రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-వరంగల్, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-కాజీపేట, కాచిగూడ-మిర్యాలగూడ, నడికుడి-మిర్యాలగూడ, గుంటూరు-వికారాబాద్. సికింద్రాబాద్-రేపల్లె, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్-గుంటూరు, సికింద్రాబాద్-సిర్పూజ్ కాగజ్ నగర్ రైళ్లు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రీషెడ్యూల్ చేశారు. హౌరా-సికింద్రాబాద్, త్రివేండ్రం-సికింద్రాబాద్, సికింద్రాబాద్-మన్మాడ్ రైళ్లు, మరో ఐదు రైళ్లు మే 20, 21 తేదీల్లో ఆలస్యంగా నడుస్తాయి. హౌరా-సికింద్రాబాద్ రైలు (12703) 20వ తేదీ ఉదయం 8.35 గంటలకు బయల్దేరాల్సి ఉండగా దానిని 11.35 గంటలకు మార్చారు. సికింద్రాబాద్-మన్మాడ్ రైలు (17064) రాత్రి 18.50 గంటలకు బయలుదేరాల్సి ఉంది కానీ రాత్రి 9.50 గంటలకు బయలుదేరనుంది. అలాగే, మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరాల్సిన భూషణేశ్వర్-ముంబై CSM(11020) 6.20కి, త్రివేండ్రం-సికింద్రాబాద్ ఉదయం 6.45కి బయలుదేరి 8.45కి, విశాఖపట్నం-ముంబై ఎల్టీటీ మధ్యాహ్నం 11.20 గంటలకు, మధ్యాహ్నం 1.2.00 గంటలకు బయలుదేరుతుంది.
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం

మరోవైపు వేసవి ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే కూడా సికింద్రాబాద్ నుంచి దానాపూర్, దిబ్రూగఢ్‌లకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీహార్‌లోని దానాపూర్, అస్సాంలోని దిబ్రూగఢ్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైలు నంబర్ 07419 సికింద్రాబాద్-దానాపూర్ మధ్య మే 20 మరియు 27 తేదీల్లో. రైలు ప్రతి శనివారం మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి ఆదివారం రాత్రి 11.15 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది.
దానాపూర్-సికింద్రాబాద్ రైలు నంబర్ 07420 మే 22- 29 తేదీల్లో బయలుదేరుతుంది. రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి మంగళవారం రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్లు కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పుర్‌కాగజ్‌నగర్, బల్లార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, పిపారియా, జబల్పూర్, కట్నీ, సత్నా, ప్రయాగ్‌రాజ్, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్, బక్సర్ రైల్వే స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతాయి. సికింద్రాబాద్-దిబ్రూగఢ్ రైలు నంబర్ 07046 మే 22-29 తేదీల్లో.. ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు బుధవారం రాత్రి 8.50 గంటలకు దిబ్రూఘర్ చేరుకుంటుంది. రైలు నెం. 07047 దిబ్రూఘర్-సికింద్రాబాద్ మధ్య మే 18, 25 మరియు జూన్ 1. ప్రతి గురువారం ఉదయం 9.20 గంటలకు బయలుదేరుతుంది. రైలు శనివారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రెండు వైపులా ప్రయాణాల్లో తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస స్టేషన్లలో రైళ్లు ఆగుతాయి. సికింద్రాబాద్-దిబ్రూగఢ్ మధ్య ట్రాఫిక్ భువనేశ్వర్, కటక్, న్యూ జల్పైగురి, గుహ్వతి మీదుగా నడుస్తుందని అధికారులు తెలిపారు.
Honeymoon: హనీమూన్‌లో అశ్లీల వీడియోలు తీసి బెదిరింపు.. రూ.10 లక్షలిస్తేనే శోభనం
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?