Site icon NTV Telugu

రేపటి నుంచి సోము వీర్రాజు రాయలసీమ పర్యటన

రేపటి నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు 4 రోజులు రాయలసీమ పర్యటన చేయనున్నారు. ఇప్పటికే సోము వీర్రాజు కర్నూలు చేరుకున్నారు. రేపు కర్నూల్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. బనగానపల్లెలోను సోమూవీర్రాజు పర్యటిస్తారని బీజేపీ శ్రేణులు తెలిపాయి. నంద్యాలలో పోలీసులు అరెస్ట్‌ చేసిన బీజేపీ కార్యకర్త సుజన్‌ పురోహిత్‌ కుటుంబాన్ని పరామర్శించనున్న సోము వీర్రాజు. ఎల్లుండి అనంతపురంలో పర్యటిస్తారు. 21న గూడూరులో పోలీసులు అరెస్ట్ చేసిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. 22న ఆత్మకూరు ఘటనపై కర్నూలులో బీజేపీ బహిరంగ సభలో సోము వీర్రాజు పాల్గొంటారు.

Exit mobile version