NTV Telugu Site icon

Somu Veerraju: కండ కావరం, అధికార దాహంతో ర్యాలీలు చేస్తారా?

Somu Veerraju

Somu Veerraju

కుటుంబ పార్టీలను రాజకీయాల నుంచి తొలగించాలన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. విజయవాడలో రెండు రోజు బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సహ ఇంచార్జ్ సునీల్ దేవధర్, జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్, ఎమ్మెల్సీలు, పదాధికారులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ ఇంచార్జ్‌లు, ఇతర నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు విజయవాడకు కేంద్రంగా ఉండేవి. ఇవాళ దేశాన్ని కమ్యూనిస్టు పార్టీ భ్రష్టు పట్టిస్తున్నాయి. త్వరలో 175 నియోజకవర్గాల్లో స్థానిక నేతల పాదయాత్రలు ఉంటాయి. సీపీఐ పార్టీ వాళ్ళను వాళ్ళే తొలగించుకుంటున్నారు….మోడీని తొలగిస్తాం అంటున్నారు. మోడీ గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదన్నారు. రోడ్డు పై డ్యాన్స్‌లు వేసే పార్టీ కమ్యూనిస్టు పార్టీ. కమ్యూనిస్టు పార్టీతో దేశంలో ఎక్కడా బీజేపీ పొత్తు పెట్టుకోలేదన్నారు.

Read Also: Nirmala Sitharaman: రూపాయి పడిపోవడం లేదు.. డాలర్ స్ట్రాంగ్ అవుతుంది.

విశాఖలో అభివృద్ధి వికేంద్రీకరణపై ఆయన మాట్లాడారు. గతంలో ఎన్టీఆర్‌కు నమ్మకం ఉంది కనుకే మండల కమిషన్ ఏర్పాటు చేశారు. వైసీపీకి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో అసలు తెలుసా?? ఒకేసారి మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది బీజేపీ. అభివృద్ధి వికేంద్రీకరణ పై వైసీపీ, టీడీపీలకు పాఠాలు చెప్పగలిగే పార్టీ రాష్ట్రంలో బీజేపీనే. చైనా రాజధాని బీజింగ్…కాని షాంఘైని అభివృద్ధి చేస్తోంది. అభివృద్ధి అంటే అది. విశాఖను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. ఈ అంశం పై చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు సోము వీర్రాజు.

హుద్ హుద్ తుఫాను అనంతం విశాఖను ఆదుకున్నామన్నారు. స్ట్రాటజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా…విశాఖ. ఇది గమనించింది నరేంద్ర మోడీ. విశాఖ అభివృద్ధికి జగన్ ఒక్క వంద కోట్లు అయినా ఖర్చు పెట్టారా? చంద్రబాబు 50 కోట్లు అయినా ఖర్చు పెట్టారా? కండ కావరం, అధికార దాహంతో ర్యాలీలు చేస్తారా? బూమ్ బూమ్ మందులు అమ్ముకోవడం తప్ప అభివృద్ధి ఆలోచన మీకు ఎక్కడ ఉందని ఘాటుగా విమర్శించారు సోము వీర్రాజు.

మీరు వేసే రోడ్ల పై బళ్ళు పడిపోతాయి…మేం వేసే రోడ్ల పై జర్రున వెళతాయి. అభివృద్ధి మా పంతం, మీది రియల్ ఎస్టేట్ దందా. ల్యాండ్ మాఫియా మీ కండక్ట్…భూ దందా మీ కండక్ట్. అభివృద్ధిలో నరేంద్ర మోడీ హీరో…మీరంతా జీరోలు. డబ్బును ఎలా దోచుకోవటమా అనేది మీ విజన్. ఉత్తరాంధ్రలో ఏం అభివృద్ధి చేశారు?? వైసీపీ, టీడీపీ అవినీతి 40 ఇష్టు 60. పోలవరం ఎప్పుడు ప్రారంభం అయ్యింది?? ఎవరు వేస్తే వారు తమ వాళ్ళను పెట్టుకునే ప్రయత్నం చేశారు. నాట్ రూలింగ్ ‌‌..ఓన్లీ ట్రేడింగ్. దసపల్లా భూములు చంద్రబాబు వర్గం, ఇప్పుడు వీళ్ళకు క్యాష్. మనం కూడా రాష్ట్రంలో సోషల్ మీడియాను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి తీసుకుని రానున్నాం. వచ్చే రోజుల్లో వాటర్ నుంచి హైడ్రోజన్‌ను తయారు చేస్తాం. విదేశాలకు విద్యుత్ అమ్ముతాం. ఇది మా విజన్ అన్నారు సోము వీర్రాజు.

Read Also: Nirmala Sitharaman: రూపాయి పడిపోవడం లేదు.. డాలర్ స్ట్రాంగ్ అవుతుంది.