ఆంధ్ర రాష్ట్రాన్ని వివాదాలు, అప్పులు, అవినీతిమయం కానివ్వం: సోము వీర్రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను సోము వీర్రాజు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వివాదాలు, అప్పులు, అవినీతిమయం కానివ్వమని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు సహజ వనరులను దోచుకుంటున్నారన్నారు. రాష్ట్రం నుంచి ట్రేడింగ్ చేసే మనస్తత్వాలు కలిగిన వారిని తరిమేస్తామన్నారు. దీనికోసం బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త బాధ్యత అని సోము వీర్రాజు అన్నారు.
Read Also: పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు: మంత్రి అవంతి శ్రీనివాస్
Also Read
- Nara Lokesh: మహానాడుపై క్లస్టర్ ఇంఛార్జ్‌లకు నారా లోకేష్ దిశానిర్దేశం
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
- Heatwave Alert: భగభగమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. మరో మూడు రోజుల పాటు ఇదే తప్పదు సుమీ..!
గణతంత్ర స్ఫూర్తి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని సోము వీర్రాజు విరుచుకుప్డడారు.
ఏపీలో మరో పార్టీ అధికారంలోకి రాకుండా వైసీపీ, టీడీపీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. అందుకే నేను టీడీపీ, వైసీపీ అని ఇరు పార్టీలు నాపై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. 2024లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నదే మా ధ్యేయం అని సోము వీర్రాజు అన్నారు. గోవా సంస్కృతి సముద్రంలో ఉంది గుడివాడలో లేదని వ్యాఖ్యానించారు. సంక్రాంతి పేరుతో క్యాసినోల నిర్వహణకు మేం వ్యతిరేకమన్నారు. ఇకపై సంక్రాంతి సంబరాలు మండలాలు వారీ ప్రభుత్వమే నిర్వహించేలా చూస్తామని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలోని అంశమని సోము వీర్రాజు పేర్కొన్నారు.
- Tags
- ap
- bjp
- republic day
- Somu Veerraju
తాజావార్తలు
-
Nara Lokesh: మహానాడుపై క్లస్టర్ ఇంఛార్జ్‌లకు నారా లోకేష్ దిశానిర్దేశం
-
Kangana-Aishwarya Rai: ఐశ్వర్య లుక్‌పై ట్రోల్స్.. కంగనా రనౌత్ సీరియస్ వార్నింగ్
-
Best Colors for Summer Clothes: వేసవిలో ఏ రంగు దుస్తులు ధరించాలి? ఈ 3 కలర్స్ మీ శరీరాన్ని ఏసీలా చల్లగా ఉంచుతాయి!
-
IPL 2026 Playoffs: ఆర్సీబీ లేదా జీటీకే ఐపీఎల్ 2026 టైటిల్.. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్లకు కష్టమే!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!