Site icon NTV Telugu

ఆంధ్ర రాష్ట్రాన్ని వివాదాలు, అప్పులు, అవినీతిమయం కానివ్వం: సోము వీర్రాజు

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను సోము వీర్రాజు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వివాదాలు, అప్పులు, అవినీతిమయం కానివ్వమని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు సహజ వనరులను దోచుకుంటున్నారన్నారు. రాష్ట్రం నుంచి ట్రేడింగ్‌ చేసే మనస్తత్వాలు కలిగిన వారిని తరిమేస్తామన్నారు. దీనికోసం బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త బాధ్యత అని సోము వీర్రాజు అన్నారు.

Read Also: పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు: మంత్రి అవంతి శ్రీనివాస్‌

గణతంత్ర స్ఫూర్తి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని సోము వీర్రాజు విరుచుకుప్డడారు.
ఏపీలో మరో పార్టీ అధికారంలోకి రాకుండా వైసీపీ, టీడీపీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. అందుకే నేను టీడీపీ, వైసీపీ అని ఇరు పార్టీలు నాపై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. 2024లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నదే మా ధ్యేయం అని సోము వీర్రాజు అన్నారు. గోవా సంస్కృతి సముద్రంలో ఉంది గుడివాడలో లేదని వ్యాఖ్యానించారు. సంక్రాంతి పేరుతో క్యాసినోల నిర్వహణకు మేం వ్యతిరేకమన్నారు. ఇకపై సంక్రాంతి సంబరాలు మండలాలు వారీ ప్రభుత్వమే నిర్వహించేలా చూస్తామని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలోని అంశమని సోము వీర్రాజు పేర్కొన్నారు.

Exit mobile version