Site icon NTV Telugu

ఏపీకి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం : సోమువీర్రాజు

రాజమండ్రి : జల వివాదంపై ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జల వివాదం ఏపీ ప్రజల సమస్య అని… ప్రజల పక్షాన రాష్ట్ర బిజెపి పోరాడుతుందన్నారు. ఏపి జలాల విషయంలో అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈనెల 4వ తేదీన బిజెపి ముఖ్య నాయకులతో కర్నూల్ లో సమావేశం నిర్వహించి.. ఈ వివాదంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

read also : దర్భంగా పేలుడు కేసులో కీలక మలుపు

మిగులు జలాలను వాడుకునే హక్కు ఏ.పి.కే ఉందని… ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు అవగాహన లేదని చురకలు అంటించారు. సీనియర్ ఇంజనీర్లు సలహా ఎందుకు తీసుకోవడంలేదు ?… ప్రాజెక్టులు నిండకుండా తెలంగాణ రాష్ట్రం.. జలవిద్యుత్ ఉత్పత్తి చేయడం అన్యాయమని ఫైర్‌ అయ్యారు. ఒరిస్సాతో జలవివాదం పరిష్కారించుకున్న విధంగానే… కృష్ణా జల వివాదం పరిష్కారించుకోవాలని సూచనలు చేశారు.

Exit mobile version