NTV Telugu Site icon

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు సోము వీర్రాజు లేఖ

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని మాజీ సైనికుల పెండింగ్‌ సమస్యలను ఆ లేఖ ద్వారా రాజ్‌నాథ్ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, సోము వీర్రాజు.. రాజ్‌నాథ్ సింగ్‌కు రాసిన లేఖలో పేర్కొన్న ముఖ్యమైన అంశాల విషయానికి వస్తే.. ఆర్మీ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్‌ను విజయవాడలో ఏర్పాటు చేయాలని కోరారు.. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా మాజీ సైనికుల వాహనాలకు టోల్ గేట్ రాయితీ వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఇక, మిలట్రీ డిస్పెన్సరీలలో ఫార్మసీ సౌకర్యం మెరుగు పర్చాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరారు సోము వీర్రాజు.