NTV Telugu Site icon

సీఎం జ‌గ‌న్‌కు సోము వీర్రాజు లేఖ‌.. అవి పునాది రాళ్లకే పరిమితం..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ దూకుడు పెంచుతోంది.. ప్ర‌తీ అంశంపై ప్ర‌భుత్వానికి డిమాండ్లు, లేఖ‌లు వెళ్తున్నాయి.. ఇవాళ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు మ‌రో లేఖ రాశారు బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. నిర్ణీత సమయంలో పేదలకు ఇళ్లు నిర్మించాల‌ని లేఖ‌లో డిమాండ్ చేశారు.. పేదల ఇళ్ల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు చెల్లించడం లేద‌ని ఆరోపించిన ఆయ‌న‌.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లింపుల్లో జాప్యం చేస్తుండడమే పేదల పాలిట శాప‌మైంద‌న్నారు.. ఇక‌, పేదల ఇళ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వంనయా పైసా ఇవ్వకుండా సొంత డబ్బా కొట్టుకుంటోంద‌ని ఫైర్ అయ్యారు సోము వీర్రాజు.. తొలి దశలో నిర్మించాల్సిన 15.75 లక్షల ఇళ్లు పునాది రాళ్లకే పరిమితం అయ్యాయ‌ని సీఎంకు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు.

Read Also: ఉపాధ్యాయుల‌పై డిప్యూటీ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు