Site icon NTV Telugu

Somu Veerraju: మంత్రి అంబటికి చిప్ పని చేస్తోందా?

Somu Veerraju

Somu Veerraju

ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుపై మండిపడ్డారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. అంబటి ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి కాదు.. మంత్రి అనే విషయాన్ని గుర్తించాలి. ఆయన చిప్ పనిచేయడం లేదేమో. ఆత్మకూరులో రాజకీయం కోసం.. ఓట్ల కోసం ఇన్ఛార్జులుగా మండలానికో మంత్రిని ఇన్ఛార్జీగా వైసీపీ నియమించింది. అలా ఇన్ఛార్జులుగా వేసిన మంత్రులను వెంబడిస్తానని నేను అన్నాను.

దానికి విపరీతార్దాలు మంత్రి అంబటి విపరీతార్ధాలు తీశారు.రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులను తామూ వెెంబడిస్తామని అంబటి అంటున్నారు.రాష్ట్ర మంత్రులు రాజకీయాలు పక్కన పెట్టి.. పెండింగ్ ప్రాజెక్టుల మీద ఫోకస్ పెడితే మంచిది.కేంద్ర మంత్రులు అభివృద్ధి కోసం పర్యటిస్తోంటే.. రాష్ట్ర మంత్రులు రాజకీయాల కోసం పని చేస్తున్నారు.మంత్రి అంబటికి ఇప్పటికీ పోలవరం గురించి అర్ధం కావడం లేదు.

కేంద్ర మంత్రులు ఉత్తరాంధ్రలో పర్యటిస్తారు.. రాటలసీమలోనూ త్వరలో పర్యటించబోతున్నారు.ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టుల మీద సమీక్షించిన అంబటి.. రాయలసీమ ప్రాజెక్టపల మీదా సమీక్షిస్తే మంచిదన్నారు సోము వీర్రాజు.

Vijaysai Reddy:చంద్రబాబు ముసలి నక్క..లోకేష్ గుంట నక్క

Exit mobile version