NTV Telugu Site icon

Somu Veerraju: 30 పైసలు కూడ ఇవ్వలేదు.. మూడు రాజధానులు అంటున్నారు..

Somu Veerraju

Somu Veerraju

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై చర్చ సాగుతూనే ఉంది.. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చెబుతుంటే.. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి ప్రతిపక్షాలు.. ఇక, ఇప్పటికే రాజధానిపై తన వైఖరిని స్పష్టం చేసింది భారతీయ జనతా పార్టీ.. అమరావతి రాజధానికి తాము కట్టుబడి ఉన్నామని తేల్చేసింది.. మరోసారి ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. సీఎం వైఎస్‌ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలుచేశారు.. సీఎం వైఎస్‌ జగన్‌.. విశాఖకి ముప్పై పైసలు కూడ ఇవ్వలేదు.. కానీ, ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారని విమర్శించారు. ఇక, రాష్ట్రంలో అభివృద్ధి మనది.. నినాదాలు వాళ్లవి అంటూ ఎద్దేవా చేశారు.

Read Also: Elon Musk: ఎలాన్‌ మస్క్‌ మార్క్‌.. అడుగు పెట్టగానే ట్విట్టర్‌ సీఈవోపై వేటు..

కాకినాడలో జరిగిన బీజేపీ జిల్లా నేతల సమావేశం పాల్గొన్న సోము వీర్రాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజధాని లేకుండా, కట్టకుండా.. ప్రజలను డివైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం వైఎస్‌ జగన్ గ్రామాలలో రోడ్లు వేయలేకపోతున్నారని మండిపడ్డ ఆయన.. 500 కోట్ల రూపాయాలు పెట్టి రోడ్లు వేసే పరిస్థితి రాష్ట్రంలో లేదు అని ఫైర్‌ అయ్యారు. ఇక, కాకినాడకి వచ్చిన పెట్రోలియం యునివర్సిటీని వైజాగ్‌కి తీసుకువెళ్లిపోయారనివిమర్శించారు. అమరావతి కేంద్రంగా రాజధాని కోసం రూ.6500 కోట్లు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నసమయంలో కేంద్రం ఇచ్చిందని గుర్తుచేసిన ఆయన.. దేశంలో రాజధాని లేని రాష్ట్రం లేదు.. రైతులను రోడ్లు మీద తిప్పుతున్నారు.. మాట తప్పం.. మడప తిప్పం అని ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు సోము వీర్రాజు..