Site icon NTV Telugu

Somu Veerraju: ఏపీలో బుద్ధిలేని నాయకత్వ పాలన..! మోడీ దగ్గర చెల్లవు..

Somu Veerraju

Somu Veerraju

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస నిర్వాసితుల గ్రామాల్లో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తోలు మందం ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి.. డబ్బు ఇసుక, చెరువులో మట్టి అమ్ముకుని సంపాదించుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు.. ఇక, ఆంధ్ర రాష్ట్రంలో బుద్ధిలేని రాష్ట్ర నాయకత్వం పరిపాలిస్తోందని విరుచుకుపడ్డ ఆయన.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దగ్గర ఇటువంటివి ఆటలు చెల్లవని హెచ్చరించారు. అంతేకాదు, రాష్ట్రంలో కొందరు నాయకులు పాదయాత్ర పేరు చెప్పి రోడ్లన్నీ అరగదీశారంటూ ఎద్దేవా చేశారు. ఇక, ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లాలో కూడా ప్రాజెక్టు నిర్వాసితులు ఉన్నారని గుర్తుచేశారు. మడ్డువలస రిజర్వాయర్‌తో పాటు అన్ని నిర్వాసిత గ్రామాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు సోము వీర్రాజు.

Read Also: Undavalli: పొత్తులపై ఉండవల్లి సంచలనం.. వారు విడిపోయినా ఆశ్చర్యంలేదు..!

Exit mobile version