NTV Telugu Site icon

Somu Veerraju: పోలవరం అంశాన్ని‌ వివాదం చేసే కుట్ర

Somu

Somu

పోలవరం అంశాన్ని‌ వివాదం చేసే కుట్ర జరుగుతోందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. పోలవరాన్ని ప్రశ్నిస్తే.. తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్లే. పోలవరం గురించి ప్రశ్నిస్తే.. రాష్ట్ర విభజన అంశాన్ని తిరగ తోడినట్లే. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాలి. రాష్ట్ర విభజనపై పూర్తిగా అధ్యయనం చేసిన ఏకైక పార్టీ బీజేపీ. పోలవరం ముంపు ప్రాంతాల్లో కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తామంటున్నారు.వారంతా భద్రాచలం మీద ఆధార పడటం‌ వల్ల అటు చూస్తున్నారు. విలీనం చేసిన మండలాల్లో‌ సీపీఎం ఆందోళన చేయడం ఏమిటి..? అన్నారు.

ఏం మాయ రోగం వచ్చింది.. టీఆర్ఎస్ పార్టీతో లాలూచి పడి రోడ్డెక్కారా..? వారికి అన్నీ తెలిసి కూడా ఇలా చేస్తారా..? చంద్రబాబు పోలవరం సోమవారం అని ఆర్భాటం చేశారు. పోలవరం విషయంలో జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇలానే ప్రకటించి దెబ్బ తిన్నారు. చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతి చేశారని జగన్ ప్రచారం చేశారు. మూడేళ్లలో వాటిని బయట పెట్టి ఎందుకు చర్యలు తీసుకోలేదు..? లోయర్ కాపర్ డ్యాం పాడైన విషయం పై అధ్యయనం జరుగుతుందన్నారు సోము వీర్రాజు. రేషన్ బియ్యం ఇవ్వకుండా జగన్ మోసం చేస్తున్నారు.

పేదలకు కేంద్రం ఇచ్చిన బియ్యం జగన్ పంపిణీ చేయడం లేదు. లక్షా నలభై వేల కార్డులు జగన్ ఇష్టం వచ్చినట్లు ఇచ్చారు. కేంద్రం గైడ్ లైన్సును పరిగణలోకి తీసుకున్నారా..?వీరిలో యాభై లక్షల మందికి అసలు బియ్యం అవసరం లేదు. వీటిని రీసైక్లింగ్ చేసి అమ్ముకుంటున్నారు. కాకినాడ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా సాగుతుంది. ఇతర దేశానికి ఇక్కడి నుంచే భారీగా వెళ్తుందని చెప్పడం విశేషం.బియ్యం కుంభకోణంపై వాస్తవాలు ప్రజలకు‌ వివరిస్తాం. పేదలు తినే బియ్యాన్ని పందికొక్కుల్లా తింటారా. వీటి వెనుక ఉన్న అందరి‌ బాగోతాలు బయట పెడతాం అని ఆవేశంగా అన్నారు సోము వీర్రాజు.

కేంద్ర మంత్రి చెప్పినా జగన్ ప్రభుత్వం స్పందించదా..? కేశినేని ఏపీ ఏక్ నాథ్ షిండే కామెంట్లపై స్పందించారు సోము వీర్రాజు. కేశినేని కామెంట్లపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారాయన. పరోక్షంగా కేశినేని కామెంట్లను సమర్థించారు సోము వీర్రాజు. ఎప్పుడో జరిగే అంశాలపై ఇప్పుడే ఎలా మాట్లాడతామంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు. కేశినేని నాని భవిష్యత్ గురించి మాట్లాడారు కదా..?అప్పుడే మాట్లాడతాం అన్నారు సోము.

K S Ravikumar : అందుకే లింగ సినిమా ఫ్లాప్‌ అయ్యింది