Site icon NTV Telugu

Somu veerraju: 2024 ఎన్నికలకు రోడ్ మ్యాప్ రెడీ.. టీడీపీతో పొత్తుపై క్లారిటీ

కర్నూలులో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ భేటీలో పలువురు బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో చెప్పేందుకు వైసీపీ మంత్రులతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. ఏపీపై ప్రత్యేక ప్రేమతో దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులను కేంద్రం ఏపీకి ఇస్తోందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. వైసీపీ నవరత్నాలను కేంద్రం నిధులతో అమలు చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిధులతోనే నిర్మిస్తామని.. కర్నూలులో రైల్వే వ్యాగన్ రిహాబిలిటేషన్ సెంటర్ త్వరలో పూర్తి చేస్తామని సోము వీర్రాజు హామీ ఇచ్చారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజీపై చర్చ జరిగిందని.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీతో ఎక్కువ నిధులు వచ్చాయని ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు జగన్ మాయలో పడి యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. మరోవైపు 2024 ఎన్నికలకు బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధమవుతోందని సోము వీర్రాజు తెలిపారు. జనసేనతో కలిసే ఎన్నికలకు వెళ్తామని.. టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందని తామెక్కడా చెప్పలేదన్నారు. ఇది కేవలం మీడియా సృష్టేనని వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీతో బీజేపీ పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది.

Exit mobile version