Site icon NTV Telugu

Somu Veerraju: జనసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటే మా లక్ష్యం..!

Somu Veerraju

Somu Veerraju

Somu Veerraju: 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జనసేన పార్టీతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా లక్ష్యం అన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కోతలు తగ్గాయన్నారు. మోడీ అంటేనే అభివృద్ధి, మోడీ అంటే అవినీతి రహిత వ్యక్తిగా అభివర్ణించారు. ఇక, ఏపీలో నారా చంద్రబాబు, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాలు రెండూ కుటుంబ పాలన పార్టీలేనని మండిపడ్డారు.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి లేని అప్పుల రాష్ట్రం, అంతా అవినీతి మయం అని ఆరోపించారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం అన్నారు.. మనం బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం పార్టీ శ్రేణులు విస్తృతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు సోమువీర్రాజు..

Read Also: Minister Seediri Appalaraju: టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించాలి.. ఒక్క ఓటు పోకూడదు..!

కాగా, ఏపీలో జరుగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్ల దాఖలు, నామినేషన్ల ఉపసంహరణ ఘట్టాలు ముగిసిపోయాయి.. ఫైనల్‌గా ఎన్నికల బరిలో ఉన్నది ఎవరో తేలిపోయింది.. దీంతో. అన్ని పార్టీలు ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించేకోవడానికి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోన్న విషయం విదితమే. ఇక, ఇప్పటికే ఐదు స్థానాలను ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. మిగతా స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.

Exit mobile version