NTV Telugu Site icon

బద్వేల్‌లో రీపోలింగ్‌ జరపాలి : సోము వీర్రాజు

ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన బద్వేల్‌ ఉప ఎన్నికకు పోలింగ్‌ నిన్న ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ నేతలు దొంగఓట్లు వేయించారని ఆరోపించారు. అంతేకాకుండా 28 చోట్ల రెగ్గింగ్‌ జరిగిందని, వివిధ ప్రాంతాల నుంచి జనాలను తీసుకువచ్చి దొంగఓట్లు వేయించారని అందుకే ఓటింగ్‌ శాతం కూడా పెరిగిందన్నారు.

అధికారంలో వైసీపీ పార్టీ బద్వేల్‌లో ఓడిపోతామని తెలిసే ఇలా చేశారని విమర్శించారు. ఏపీలో ప్రజాస్వామ్యాని మట్టిలో పెట్టారని అన్నారు. అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారన్నారు. బద్వేల్‌లో రీపోలింగ్‌ నిర్వహించాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు.