NTV Telugu Site icon

ఆనంద‌య్య మందుపై సోమిరెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు… అక్క‌డ అక్ర‌మంగా త‌యారు చేస్తున్నారు…

ఆనంద‌య్య మెడిసిన్‌పై ప్ర‌స్తుతం ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. కృష్ణ‌ప‌ట్నం పోర్టులో సీవీఆర్ ఫౌండేష‌న్ బిల్టింగ్‌లో అన‌ధికారికంగా వేల మందికి మందు త‌యారు చేస్తున్నార‌ని, ఆనంద‌య్య మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవ‌ని ఆయుష్ క‌మీష‌న‌ర్‌, స్టేట్ హెల్త్ ప్ర‌క‌టించినా ఎందుకు మందును పంపిణీ చేయ‌డంలేద‌ని టీడీపీ నేత సోమిరెడ్డి ప్ర‌శ్నించారు. ఆనంద‌య్య బీసీ వ‌ర్గానికి చెందిన వ్యక్తి కావ‌డం వ‌ల‌నే ఇలా చేస్తున్నార‌ని, అదే అగ్ర‌వ‌ర్ణానికి చెందిన వ్య‌క్తి అయి ఉంటే ఇన్ని రోజులు అక్ర‌మంగా ఆయ‌న్ను నిర్భందించేవారా అని సోమిరెడ్డి ప్ర‌శ్నించారు. పేద‌ల‌కు పంపిణీని ఆపేసి, పెద్దోళ్ల‌కు మాత్రం ప్యాకెట్ల రూపంలో మందు స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌ని సోమిరెడ్డి ఆరోపించారు. 70 వేల మందికి మందు పంపిణీ చేసినా ఒక్క వ్య‌క్తి నుంచి కూడా నెగెటీవ్ ఫీడ్‌బ్యాక్ రాలేద‌ని, ఆనంద‌య్య‌ను నిర్బందించ‌డం బాధాక‌రం అని, వెంట‌నే ఆయ‌న‌కు స్వేచ్చ ఇవ్వాల‌ని సోమిరెడ్డి పేర్కోన్నారు.