Site icon NTV Telugu

Somireddy: వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిచిపోతున్నాయి.. డైపర్లు పెట్టుకోవాలి..!!

Somireddy Chandra Mohan Reddy

Somireddy Chandra Mohan Reddy

Somireddy: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశంపై వైసీపీ నేతల కౌంటర్లకు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ భేటీతో వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిచిపోతున్నాయని.. ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా వైసీపీ నేతలు డైపర్లు పెట్టుకోవాలంటూ సోమిరెడ్డి చురకలు అంటించారు. చంద్రబాబు, పవన్ భేటీ ఓ ప్రభంజనం అని కీర్తించారు. రాష్ట్రాన్ని కాపాడాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవాలని ప్రజలే కోరుకుంటున్నారని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు.

అటు చంద్రబాబు-పవన్ కళ్యాణ్ కలిస్తే వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. వాళ్లిద్దరూ కలిస్తే తాము ఓడిపోతామని వైసీపీ నేతలకు భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌ను ఆనాడు విశాఖలో అడ్డుకున్నారని.. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబును అదే తరహాలో అడ్డుకుని ఆంక్షలు విధించారని చినరాజప్ప మండిపడ్డారు. ఈ అంశంపై చంద్రబాబును పలకరించడానికి పవన్ వెళ్తే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారని వైసీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీకి అడ్రస్ ఉండదనే భయంతో మంత్రులు నోటికొచ్చినట్లు అవాకులు, చెవాకులు పేలుతున్నారని చినరాజప్ప ఆరోపించారు.

Read Also: Soap Bank: 90 లక్షల సబ్బులను సేకరించిన యువకుడు.. వాటిని ఏం చేశాడంటే..?

Exit mobile version