ఏపీలో వైసీపీ నేతలు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలు కొనసాగుతున్నాయి. ఈ యాత్రలపై టీడీపీ మండిపడుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీ నేతల బస్ యాత్ర ఎత్తిపోయింది. వాళ్లే కుర్చీలు తీసుకెళ్తున్నారు.. జనం లేకపోయేసరికి వాళ్లే కుర్చీలను తీసుకెళ్లిపోతున్నారని విమర్శించారు.
జగన్ స్వయంగా తమది రివర్స్ పాలన అని చెప్పారు. ఇప్పుడు వైసీపీ బస్ యాత్ర అంతా రివర్సులోనే ఉంది. కైవల్యా రెడ్డి నెల్లూరులో ఆనం కుమార్తెమో కానీ.. కడపలో మా బద్వేలు విజయమ్మ కోడలు. కైవల్యా రెడ్డి ఆత్మకూరు టిక్కెట్ అడిగారా..? లేదా..? అనేది నాకు తెలీదు. అయినా టిక్కెట్ల కేటాయింపు విషయంపై ఇప్పుడే చర్చ ఉండదన్నారు. నెల్లూరు జిల్లాలో జరిగే ప్రతి పరిణామం ప్రత్యేకమైనదే.
మంచి కోసం ఏ పరిణామం జరిగినా మేం ఆహ్వానిస్తూనే ఉంటాం. మేం ఇక్కడే కుర్చీ వేసుకుని కూర్చొంటాం.. రాష్ట్ర, పార్టీ ప్రయోజనాల కోసం ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం. కేసీఆర్ కు ఇన్నాళ్లకైనా ఎన్టీఆర్ గుర్తొచ్చినందుకు సంతోషం. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రధాన నేతలంతా మా టీడీపీ వాళ్లే.. ఎన్టీఆర్ శిష్యులే. ఒంగోలులో మా బహిరంగ సభ సాయంత్రం ఆరు గంటలకంటే.. ఉదయం ఆరు గంటల నుంచే జనం వచ్చేశారన్నారు పోమిరెడ్డి.
Pakistan On Kashmir: మళ్లీ అదే పాత పాట.. కాశ్మీర్ పై విషం కక్కిన పాక్