ఏపీకి సంKarnataka: టిప్పు సుల్తాన్ గూండా అన్న ఎమ్మెల్యే.. మరోసారి అంటే నాలుక కోస్తామని హెచ్చరికబంధించి విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్రం అడుగులు ముందుకు వేస్తోంది. నేడు కేంద్ర ఉన్నతాధికారులతో ఏపీ అధికారుల ప్రతినిధి బృందం సమావేశం కానుంది.ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు
టివి సోమవాథన్ కమిటి సమావేశం కానుంది. నార్త్ బ్లాకు లోని ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో సమావేశం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే పట్టుదలతో ఏపి సిఎం వున్నారు. పనులు వేగవంతం చేయాలని జగన్ కేంద్రాన్ని కోరారు.
ఈల 22వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపి సమస్యల పరిష్కారం పై కదలిక వచ్చిందని అధికారులు అంటున్నారు. గత జనవరిలో తొలిసారి సమావేశమైన సోమనాథన్ కమిటీ పలు అంశాలు చర్చించింది. విభజన చట్టానికి సంబంధించి పలు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ఆర్ధిక శాఖ ( వ్యయ విభాగం) కార్యదర్శి టివి సోమవాధన్ అధ్యక్షతన కమిటీ ని ఏర్పాటు చేసింది కేంద్రం. పెండింగ్ లో ఉన్న పలు విభజన సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన బకాయులు పై ఏపి, సంబంధిత పలు కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష సమావేశం జరగనుంది.
ఈరోజు జరిగే ఉన్నతస్థాయు సమావేశానికి ముందస్తుగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయు రెడ్డి అధ్యక్షతన నిన్న ఏపి భవన్ లో ఏపీ అధికారుల ప్రతినిధి బృందంతో మూడున్నర గంటల పాటు సమీక్షా సమావేశం అవుతోంది. ఏపి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఏపి ఆర్ధిక శాఖ కార్యదర్శి రావత్ తో సహా, రాష్ట్ర పరిశ్రమలు, ఆరోగ్యం, విద్యుత్ శాఖల సెక్రటరీ లతో విజయసాయు రెడ్డి అంశాల వారీగా సుదీర్ఘ చర్చలు జరుగుతాయి. పోలవరం ప్రాజెక్టు, విభజన తర్వాత ఏపి ఎదుర్కుంటున్న ఆర్ధిక వనరుల కొరత, “జాతీయ ఆహార భద్రతాచట్టం” కింద అర్హుల ఎంపికలో లోపించిన హేతుబద్ధత, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయులు లాంటి తదితర అంశాలపై సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో ఈ రోజు సమీక్ష సమావేశంలో చర్చించనున్నారు.
Read Also: Karnataka: టిప్పు సుల్తాన్ గూండా అన్న ఎమ్మెల్యే.. మరోసారి అంటే నాలుక కోస్తామని హెచ్చరిక
టెక్నికల్ అడ్వైజర్ కమిటీ” నిర్ధారించిన పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని కోరుతుంది ఏపీ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపి ఖర్చు పెట్టిన సొంత నిధులు సుమారు 2900 కోట్ల రూపాయలను కేంద్రం రాష్ట్రానికి చెల్లించాలి. పెండింగు లో ఉన్న అన్ని అంశాలను ఏలాంటి జాప్యం లేకుండా తక్షణమే పరిష్కరించాలని గత సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అభ్యర్థించారు ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ మేరకు, అన్ని రకాల తోడ్పాటును అందిస్తామని ఏపి సిఎమ్ కు భరోసా ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడంతో పాటు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపే ఇతరత్రా అన్ని పెండింగ్ సమస్యలను పరిష్కారం చేసుకోవాలనే కృతనిశ్చయం తో ఉన్నారు ఏపీ సీఎం జగన్.
