Snake Bite: కుటుంబానికి పాము గండం.. 45 రోజుల్లో ఆరుసార్లు పాముకాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లాలోని ఓ కుటుంబానికి పాము గండం పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో పాము పేరు చెప్తే చాలు ఆ కుటుంబం వణికిపోతోంది. 45 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఆరుసార్లు పాము కాటేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రగిరి మండలం దోర్నకంబాల పంచాయతీ మల్లయ్యపల్లి ఆంధ్రవాడకు చెందిన వెంకటేష్, తన భార్య వెంకటమ్మ, కుమారుడు జగదీష్ తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ అటవీప్రాంతం సమీపంలోని కొట్టంలో జీవనం సాగిస్తున్నారు.
ఇటీవల శనివారం రాత్రి జగదీష్ ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో అతడి కాలుపై పాము కాటేసింది. వెంటనే అతడిని కుటుంబీకులు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. గతంలో వెంకటేష్ రెండు సార్లు, ఆయన తండ్రి, ఆయన భార్య వెంకటమ్మ, కుమారుడు జగదీష్ ఒక్కోసారి పాముకాటుకు గురయ్యారు. తాజాగా జగదీష్‌ను రెండోసారి పాము కాటేసింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. బాధితులు నివసించే కొట్టం సమీపంలో మరో మూడు కుటుంబాలు నివసిస్తున్నా.. వారిని పాము ఏమీ చేయడం లేదని గ్రామస్తులు వెల్లడించారు. అయితే బాధిత కుటుంబసభ్యులు మరోచోటకు వెళ్లేందుకు అంగీకరించడం లేదని వారు వాపోతున్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!