AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, చాణక్యలను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. సబ్ జైలు నుంచి వైద్య పరీక్షలు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, రెండో రోజు కేసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్.. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, తొలి రోజు 7 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు.. మద్యం సరఫరా, డిస్టిలరీలపై కేసిరెడ్డికి ప్రశ్నలు సంధించారు. ప్రతి నెలా రూ. 50 కోట్ల నుంచి 60 కోట్లు ఎలా వసూలు చేశారు.. ఆ సొమ్మంతా ఏయే రూపాల్లో ఎవరికిచ్చారు.. ఈ లిక్కర్ కేసులో ప్రధాన సూత్రదారి ఎవరంటూ సిట్ బృందం ప్రశ్నల వర్షం కురిపించింది.
Read Also: Buggamatham Lands: కాసేపట్లో తిరుపతి బుగ్గమఠం భూముల సర్వే..
అయితే, లిక్కర్ కుంభకోణం కేసులో రాజ్ కేసిరెడ్డికి వారం రోజుల పాటు కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఇవాళ్టి నుంచి కేసులో ఏ8గా ఉన్న చాణక్యను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. అయితే, ముందు వీరిని విడివిడిగా ప్రశ్నించిన తర్వాత ఇద్దరినీ కలిపి మరోసారి ప్రశ్నించనున్నారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలను వారి ముందు పెట్టనున్నారు సిట్ టీమ్.
