NTV Telugu Site icon

Sand E-Auction: సిలికా శాండ్‌కి ఈ-ఆక్షన్.. రికార్డు స్థాయిలో బిడ్

E Bid

E Bid

ఏపీలో సిలికా శాండ్ ఈ ఆక్షన్ (E-Auction) నిర్వహించింది ప్రభుత్వం. దీనికి అనూహ్య స్పందన లభించింది. నెల్లూరు జిల్లాలో సిలికాశాండ్ ఈ- ఆక్షన్ కు రికార్డు స్థాయిలో బిడ్ (Bid) దాఖలయింది. చిల్లకూర్ మండలంలోని తూర్పు కానుపూర్ గ్రామ పరిధిలోని ఆరు హెక్టార్లల్లోని సిలికా శాండ్ కి ఈ-ఆక్షన్ నిర్వహించారు. రూ.1.60 కోట్లతో ప్రారంభమైంది ఈ-ఆక్షన్. ఇందులో అత్యధికంగా రూ. 3.16 కోట్లు కోట్ చేసి బిడ్ దక్కించుకుంది స్మార్కో ఇండస్ట్రీస్.

గ్లాస్ ఆధారిత పరిశ్రమలో కీలక ఖనిజంగా సిలికా శాండ్. గనుల శాఖ డైరెక్టర్ (Mines Department) విజి వెంకటరెడ్డి మాట్లాడుతూ… సిలికాశాండ్ తో ప్రభుత్వానికి మైనింగ్ రెవెన్యూ భారీగా లభించిందన్నారు. మొత్తం ఐదు సంస్థలు సిలికాశాండ్ టెండర్లలో పోటీ పడ్డాయి. రూ.1.60 కోట్ల రూపాయల ప్రారంభ ధరతో ఆక్షన్ మొదలవ్వగా, స్మార్కో ఇండస్ట్రీస్ అత్యధికంగా 3,16,20,000 రూపాయలను కోట్ చేసింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఈ స్థాయిలో ధర పలికిందన్నా వెంకటరెడ్డి. సిలికాశాండ్ ఖనిజ నిల్వలకు గనుల శాఖ అత్యంత పారదర్శకతతో ఈ ఆక్షన్ నిర్వహించామని ఆయన తెలిపారు.

Road Terror: బస్ బోల్తా ప్రమాదంలో పెరిగిన మృతులు..