Site icon NTV Telugu

YS Viveka Murder Case: వివేకాపై సంచలన ఆరోపణలు.. అందుకే హత్య..!

Ys Viveka

Ys Viveka

YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి.. తెలంగాణ హైకోర్టులో ఈ రోజు వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ జరిగింది.. వైఎస్‌ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది హైకోర్టు.. అయితే, నిందితుడిగా ఉన్న దస్తగిరిని అప్రూవర్ గా మార్చడంపై వైఎస్‌ భాస్కర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. దస్తగిరి స్టేట్‌మెంట్‌ ఆధారంగా భాస్కర్ రెడ్డిని ఎలా ఈ కేసులోకి లాగుతారని ఆయన తరుపు లాయర్‌ వాదనలు వినిపించారు.. వైఎస్‌ వివేకా కూతురు, సీబీఐ కలిసిపోయి దస్తగిరిని అప్రూవర్ గా మార్చారని ఆరోపించారు భాస్కర్ రెడ్డి తరపు లాయర్..

Read Also: Vizag Steel Plant: బిడ్డింగ్‌లో తెలంగాణ సర్కార్‌ పాల్గొంటే స్వాగతిస్తాం..!

ఇక, గూగుల్ టేక్ ఔట్ ఫోటోలు ఎలా ఆధారాలు అవుతాయి? అని ప్రశ్నించారు.. దాంతో వైఎస్‌ భాస్కర్ రెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డిలు ఎలా నిందితులు అవుతారని వాదనలు వినిపించారు లాయర్‌.. మరోవైపు.. వైఎస్‌ భాస్కర్ రెడ్డి లాయర్ వాదనలో కీలక అంశాలు తెరపైకి వచ్చాయి.. సునీల్ యాదవ్ తల్లిని వైఎస్‌ వివేకానంద రెడ్డి లైంగికంగా వేధించాడని కోర్టులో ప్రస్తావించారు భాస్కర్ రెడ్డి తరపు లాయర్.. అందుకే సునీల్ యాదవ్ కక్ష గట్టి.. వైఎస్‌ వివేకాను హత్య చేశాడని పేర్కొన్నారు.. దీంతో.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చినట్టు అయ్యింది.

Exit mobile version