Site icon NTV Telugu

YS Jagan Nellore Tour: సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం..!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ నెల్లూరులో పర్యటించారు.. గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నెల్లూరు పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.. ఆ తర్వాత రోడ్డు మార్గాన బయలుదేరి వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకున్నారు.. అక్కడ మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పాల్గొన్నారు అనంతరం మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యారు.. అయితే, సీఎం వైఎస్‌ జగన్‌.. నెల్లూరు జిల్లా పర్యటనలో భద్రతా వైఫల్యం బయటపడింది..

Read Also: Oscars 2022 : వేదికపై విల్ స్మిత్ యాక్షన్… తనయుడు, హాలీవుడ్ సెలెబ్రిటీల రియాక్షన్

మూడంచెల భద్రతా వలయాన్ని ఛేదించుకుని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నాడు ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన విద్యార్థి… అంతటితో ఆగకుండా.. సెల్‌ ఫోన్‌ కెమెరాలతో సీఎం వైఎస్‌ జగన్‌ దృశ్యాలను చిత్రీకరించాడు.. ఇక, చివరి నిమిషంలో ఈ ఘటనను గుర్తించిన పోలీసులు.. విద్యార్థిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. భద్రతా కారణాలతో ఆ ప్రాంతానికి మీడియాను అనుమతించని పోలీసులు.. విద్యార్థి అక్కడికి వచ్చేవరకు ఎందుకు పట్టించుకోలేదు అనేది చర్చగా మారింది. మరి ఆ విద్యార్థి సాధారణంగా సీఎం దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడా? లేదా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Exit mobile version