Site icon NTV Telugu

ఈ నెల 16 నుంచి ఏపీలో స్కూళ్లు రీ-ఓపెన్…

కరోనా కారణంగా ప్రస్తుతం ఏపీలో స్కూళ్లు బంద్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 16వ తేదీ నుంచి స్కూళ్లను రీ-ఓపెన్ చేయనుంది ఏపీ ప్రభుత్వం. అందువల్ల 16వ తేదీ నాటికి మొదటి విడత నాడు-నేడు పనులు పూర్తి చేయాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. నాడు-నేడు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షితున్నారు విద్యా శాఖ ఉన్నతాధికారులు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా జరుగుతున్నాయి నాడు-నేడు పనులు.ఆధునికీకరణతో ప్రభుత్వ స్కూళ్లకు న్యూ లుక్ రానుంది. ఇక అడ్మిషన్ల కోసం ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్ధుల తల్లిదండ్రులు వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ తరహాలో తీర్చిదిద్దడంతో విద్యార్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటోన్నారు ఉపాధ్యాయులు.

Exit mobile version