NTV Telugu Site icon

School Bus Accident: ప్రమాదంలో స్కూల్‌ బస్సు నుజ్జునుజ్జు.. తృటిలో తప్పించుకున్న 20 మంది విద్యార్థులు

School Bus

School Bus

దాదాపు 20 మంది స్కూల్‌ విద్యార్థులు తృటిలో పెను ప్రమాదం తప్పింది.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లాలో ఇవాళ స్కూల్‌ బస్సు ప్రమాదానికి గురైంది.. సఖినేటిపల్లి నుంచి నరసాపురం వెళ్తున్న ఓ ప్రైవేట్‌ స్కూల్‌కు చెందిన బస్సు.. మలికిపురం మండలం దిండి గ్రామంలో ప్రమాదం జరిగింది.. వేగంగా దూసుకొచ్చిన ట్రాక్టర్, స్కూల్ బస్సును ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో స్కూల్‌ బస్సు నుజ్జునుజ్జు అయ్యింది… ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుండగా.. నలుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి… ఆ విద్యార్థులను రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు మలికిపురం పోలీసులు.. అయితే, బస్సు నుజ్జునుజ్జైనా.. విద్యార్థులంతా క్షేమంగా బయటపడడంతో.. తల్లిదండ్రులు, స్కూల్‌ యాజమాన్యం, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు..

Read Also: Bus Catches Fire: ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. బస్సులో 40 మంది ప్రయాణికులు..

మరోవైపు.. తిరుపతి రూరల్ మండలం, మల్లంగుటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో స్పందించడంతో ప్రమాదం తప్పింది. రేణిగుంటలోని ఫాక్స్ కాన్ కంపెనీకి చెందిన మహిళలు మల్లంగుంటలోని హాస్టల్ లో ఉంటున్నారు. 5 ఫోర్లు, 150 గదులు గల హాస్టల్ 650 మంది ఉంటున్నారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. స్టోర్ లో ఉన్న వస్తువులు, బెడ్స్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. హాస్టల్ నిర్వాహకులు అక్కడ ఉన్న మహిళను వెంటనే రేణిగుంట కు తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.