Site icon NTV Telugu

Ayesha Meera Case: ఏపీ ప్రభుత్వానికి మరోసారి సత్యం బాబు వినతి

Satyam Babu

Satyam Babu

బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో చేయని నేరానికి తాను 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించానని సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ కేసులో సత్యం బాబు నిర్దోషి అని 2017లో ఏపీ హైకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తన పరిస్థితిని వివరించి తనకు రెండు ఎకరాల సాగు భూమి, రూ.10 లక్షల పరిహారంతో పాటు ఇల్లు ఇవ్వాలని సత్యంబాబు కలెక్టర్‌ను కోరాడు. దీంతో సత్యంబాబుకు సహాయం చేయాలని గతంలోనే నందిగామ ఎమ్మార్వోను కలెక్టర్ ఆదేశించారు. అయినా ఇప్పటివరకు సత్యంబాబుకు సహాయం అందలేదు.

Anil Kumar Yadav: లోకేష్ మరోసారి పప్పు అని నిరూపించుకున్నారు

తాజాగా తనకు పరిహారం అందించాలని మరోసారి సత్యంబాబు ఏపీ ప్రభుత్వాన్ని కోరాడు. అయేషామీరా హత్య కేసులో కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించినందున పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావును సత్యంబాబు కలిసి అర్జీని సమర్పించాడు. నాలుగేళ్లు గడిచినా తనకు సహాయం అందలేదని ఆరోపిస్తూ 2 ఎకరాల వ్యవసాయ భూమి, 10 లక్షల పరిహారం, ఇల్లుపై గతంలో చేసుకున్న దరఖాస్తుల కాపీతో పాటు తాజాగా మరో దరఖాస్తును కలెక్టర్‌కు సత్యంబాబు సమర్పించాడు.

Exit mobile version