Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Sankranti 2026 Travel Crisis Private Bus Fare Hike Leaves Ap Passengers Burdened

Sankranti 2026: బాదుడే బాదుడు.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు మొదలైన ‘సంక్రాంతి’ పండుగ!

Published Date :December 7, 2025 , 12:43 pm
By Sampath Kumar
  • ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు మొదలైన సంక్రాంతి
  • సొంత ఊరికి ప్రయాణించాలంటే ఓ నెల జీతం సరిపోదేమో
  • 2-3 రెట్లు ధర పెంచేసి టికెట్ల విక్రయాలు
Sankranti 2026: బాదుడే బాదుడు.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు మొదలైన ‘సంక్రాంతి’ పండుగ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘సంక్రాంతి’ లాంటి పెద్ద పండుగలు వచ్చాయంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్, ప్రైవేట్ బస్సుల నిర్వాహకులకు మొదలవుతుంది అసలు పండుగ. పండక్కి సకుటుంబ సమేతంగా సొంత ఊర్లకు వెళ్లాలంటే ట్రైన్ల తర్వాత బస్సులే దిక్కు. ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, చిన్నో పెద్ద పని చేసుకుంటూ బతుకుతున్న కుటుంబాలు సంక్రాంతికి సొంత ఊరికి ప్రయాణించాలంటే ఓ నెల జీతం సరిపోదేమో. సాధారణ రోజుల కంటే పండగ సమయాల్లో 2-3 రెట్లు ధర పెంచేసి టికెట్లు విక్రయిస్తారు.

ఆర్టీసీలో సరిపడా సర్వీసులు ఉండకపోవడంతో.. ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇదే అదునుగా రిజర్వేషన్లు, బుకింగ్‌ల పేరుతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిలువ దోపిడీకి పాల్పడుతోంది. విశాఖ-హైదరాబాద్, హైదరాబాద్-విశాఖకు వెళ్లాలంటే సాధారణ రోజుల్లో టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అదే పండగ సమయంలో ఆరు వేల నుంచి 8 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. వీటన్నిటికీ భయపడి నెల రోజుల ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకుంటున్నారు ప్రయాణికులు. అయినా కూడా ప్రయాణికులపై బాదుడు భారం తప్పడం లేదు.

Also Read: AP Farmers: ఓవైపు తుఫాన్‌లు, మరోవైపు ధరలు.. అల్లాడిపోతున్న రైతులు!

సంక్రాంతి పండగకి ఇంకా నెల రోజులే ఉంది. సెలవులకు సొంత ఊళ్లకు వెళ్ళడానికి ఇప్పటికే ప్లాన్ వేసుకుంటున్నారు ప్రజలు. అయితే ఫ్యామిలీలతో పండక్కి ఊరెళ్ళి తిరిగి రావడం ఆషామాషీ కాదు. సంక్రాంతి పండగ ఏమో కానీ జర్నీ విషయానికొస్తేనే గుండె గుబేలు మనేలా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. రానుపోను ప్రయాణాలు పెద్ద సమస్యగా మారింది. విశాఖ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు.. ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర వైపు వచ్చే వాళ్ళు రెండు నెలలు ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. ఫస్ట్ ప్రియారిటి ట్రైన్ జర్నీకి ఇచ్చినప్పటికీ రిజర్వేషన్లు టికెట్స్ కొందరికి మాత్రమే దక్కుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్రస్తుతానికి 30 వరకు ట్రైన్లు నడుస్తున్నాయి. రెగ్యులర్ ట్రైన్స్ తో పాటు వీక్లీ ట్రైన్స్ కూడా దాదాపుగా రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సరిపడా ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప.. సాఫీగా ప్రయాణం చేసేటట్టు కనిపించడం లేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Sankranti 2026
  • Sankranti 2026 Bookings
  • Sankranti 2026 Bus Reservations
  • Sankranti 2026 BUs Tickets
  • Sankranti 2026 Reservations

తాజావార్తలు

  • Insurance Price: తగ్గనున్న ఇన్సురెన్స్ ప్రీమియం ధరలు.. మోటార్, హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్‌లు ఇక తక్కువ ధరలోనే..

  • US-Iran ceasefire: అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్..

  • Nayan Sarika: ‘రాకాసా’తో మరో హిట్ ఖాతాలో వేసుకున్న క్రేజీ బ్యూటీ..

  • Village Volunteer: ‘ప్రతీ గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమిస్తాం’: మంత్రి తుమ్మల

  • Cameron Green Trolls: 18, 2, 4.. 25 కోట్లు బొక్క.. కామెరూన్‌ గ్రీన్‌ను ఎలిమినేట్ చేయండి సర్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions